Gangula Kamalakar: బోటు ప్రమాదం నుంచి తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సురక్షితంగా బయటపడ్డారు. తెలంగాణ అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా ఊరూర చెరువుల ఉత్సవాల్లో మంత్రి గంగుల పాల్గొన్నారు. ఈ క్రమంలో చెరువులో పడవ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మంత్రి ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడి నీటిలో పడిపోయాడు. కానీ అతను పడిన చెరువు లోతు తక్కువగా ఉండడంతో ప్రమాదం తప్పింది.
Read also: Sharad Pawar: శరద్ పవార్, సుప్రియా సూలేలను చంపేస్తాం.. ట్విట్టర్లో హత్య బెదిరింపులు
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకలను కేసీఆర్ సర్కార్ ఘనంగా జరుపుకుంటోంది. ఇందులో భాగంగా మిషన్ కాకతీయ ద్వారా పునరుద్ధరించిన చెరువుల వద్ద బీఆర్‌ఎస్ ప్రభుత్వం వేడుకలు నిర్వహించింది. ఊరూర చెరువుల పండుగ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా చెరువుల వద్ద ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో వేడుకలు నిర్వహించారు. కరీంనగర్ రూరల్ మండలం ఆసిఫానగర్ చెరువులో జరిగిన వేడుకల్లో మంత్రి గంగుల పాల్గొన్నారు. చెరువు వద్ద పూజలు చేసిన మంత్రి గంగుల ప్రజలు బీఆర్ ఎస్ కార్యకర్తల కోరిక మేరకు నాటు పడవ ఎక్కారు. ఈ పడవలో చెరువులోకి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బోటు బోల్తా పడి మంత్రి గంగుల చెరువులో పడిపోయారు. అయితే ప్రమాదం జరిగిన ప్రాంతంలో లోతు తక్కువగా ఉండడంతో మంత్రి నడుచుకుంటూ బయటకు వచ్చారు. మంత్రి నీటిలో పడిన వెంటనే భద్రతా సిబ్బంది, పోలీసులు చెరువులోకి దిగారు. నీటిలో పడిన గంగును సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. బోటు ప్రమాదం నుంచి మంత్రి గంగుల కమలాకర్ సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Bhatti Vikramarka: పీపుల్స్ మార్చ్ కు 85వ రోజు.. చందంపేట ప్రజలకు భట్టి పలకరింపు