Errabelli Dayakar Rao: బీఆర్ఎస్ పేరు మార్చేసిన మంత్రి… వైరల్‌గా మారిన వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజకీయాల్లో అడుగుపెట్టారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. విజయదశమి రోజున ముహూర్తం పెట్టి మరీ పార్టీ పేరును మార్చారు.. తెలంగాణ భవన్ వేదికగా టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం జరిగింది.. టీఆర్ఎస్ పార్టీ పేరును భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)గా మారుస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు.. ఇవాళ బీఆర్‌ఎస్ నేతలు.. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి.. ఈ మేరకు సర్వసభ్య సమావేశంలో పార్టీ పేరు మార్పుపై ఏకగ్రీవంగా చేసిన తీర్మానాన్ని అందజేయనున్నారు.. రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌పై చర్చ సాగుతోంది.. టీఆర్ఎస్ నేతలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వివిధ పార్టీల నేతలు కూడా హైదరాబాద్ వచ్చి.. బీఆర్ఎస్ గురించి మాట్లాడారు.. సీఎం కేసీఆర్‌కు అభినందనలు తెలిపారు.. ఇంతా జరుగుతుంటే.. కేసీఆర్ కేబినెట్‌లో మంత్రిగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాకు పనిచెప్పాయి..
Read Also: RRR for Oscars: అఫీషియల్.. ఈ 15 కేటగిరీల్లో ఆస్కార్స్ కోసం ఆర్ఆర్ఆర్
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
విజయదశమిని పురస్కరించుకుని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.. రావణ దహనం చేశారు.. ఈ సందర్భంగా ఒక వేదికపై ఆయన మాట్లాడుతూ.. నోరు జారారు.. టీఆర్ఎస్ పెట్టి తెలంగాణ సాధించారు.. సీఎం కేసీఆర్, కేటీఆర్.. ఇప్పుడు భారతీయ… అని మధ్యలో ఆపి.. ఏ పార్టీ పెట్టారని అక్కడి ప్రజలను ప్రశ్నించారు.. ఓ యువకుడు బీఎస్పీ.. మరో యువకుడి నుంచి బీఆర్‌ఎస్ అనే సమాధానాలు వినిపించాయి.. కానీ, మంత్రి మళ్లీ మాట్లాడుతూ.. కేసీఆర్ పెట్టింది బీఎస్సీ.. శుభదినం రోజు కేసీఆర్ బీఎస్పీ ప్రకటించారు.. జాతీయ రాజకీయాల్లో రాణిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. మొత్తంగా.. టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్‌ఎస్ పార్టీగా మారితే.. మంత్రి ఎర్రబెల్లి మాత్రం.. బీఎస్పీ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.. సీఎం ప్రకటించిన పార్టీ పేరు కూడా తెలియదా? లేక మరిచ్చిపోయారా? అంటూ మంత్రిని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు..
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు