JPS Strike: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పంచాయతీ కార్యదర్శుల సమ్మెపై మంత్రి ఎర్రబెల్లి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. పంచాయతీ కార్యదర్శులు అందరూ సాయంత్రం ఐదు గంటల్లోగా విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేసారు. మీరు ఉద్యోగాల్లో చేరేటప్పుడే సమ్మెల్లో పాల్గొనబోమని, యూనియన్లను పెట్టమని లికిత పూర్వకంగా రాసి ఇచ్చారని గుర్తు చేశారు. కొందరి మాటల వల్ల మీరు తొందరపడి సమ్మెకు దిగారని అన్నారు. సీఎం కేసీఆర్ మనసున్న మారాజని, ఆయన త్వరలోనే మీ సమస్యలన్నింటికి పరిష్కరమార్గం చూపుతారని తెలిపారు. ఎవరు బేషజాలకు పోకుండా అందరూ విధుల్లో చేరాలని మంత్రి ఎర్రబెల్లి మరోసారి విజ్ఞప్తి చేసారు.
Read also: TS Inter Results 2023: తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా..
ఇది ఇలా ఉంటే.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 12 రోజుల నుండి జూనియర్ పంచాయతీ కార్యదర్శిల శాంతియుత నిరువధిక సమ్మె కొనసాగుతుంది. దానిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఈరోజు 5 గంటల వరకు విధుల్లో చేరకపోతే విధుల నుండి తొలగిస్తామని నోటీసులు జారీ చేయడంతో ఉద్యోగస్తులు స్పందించారు. తమను వీధిలోకి తీసుకునేటప్పుడు ప్రభుత్వము జారీ చేసిన జీవో ప్రకారం మూడు సంవత్సరాలు ప్రొబిషన్ పీరియడ్ అని తెలిపారు. మూడు సంవత్సరాల తర్వాత రెగ్యులరైజేషన్ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన సీఎం కేసీఆర్ తెలిపారని గుర్తు చేశారు. మూడు సంవత్సరాల టైం కరోనా కాలంలోనే అయిపోయినా కూడా ప్రభుత్వ పరిస్థితులను బట్టి మేము ఎలాంటి నిరసన తెలుపలేదని గుర్తు చేశారు. ఇప్పుడు మరొక సంవత్సరం ప్రొబేషన్ పీరియడ్ గా ప్రభుత్వము జీవో జారీ చేయడం ఉద్యోగస్తుల మోసం చేయడమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో చేరేటప్పుడు మాకు ఇచ్చిన జీవోలో ఎలాంటి కాంట్రాక్ట్ అని లేదని మండిపడ్డారు. దానిలో ఉన్న జీవ ప్రకారమే మా హక్కులను అడుగుతున్నామని స్పష్టం చేశారు. మేం సంఘాలను పెట్టామని ప్రభుత్వం అంటుంటే మాకు ఎలాంటి సంఘాలు లేవని ప్రతి ఒక్కరు మాకు ఉద్యోగ భద్రత కావాలంటూ నిరసన తెలుపుతున్నానని తెలిపారు. ఈరోజు 5 గంటల వరకు మాకు విధించిన డెడ్లైన్ లకు భయపడే ప్రసక్తే లేదు మా సమ్మెను యధావిధాగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ప్రభుత్వము మమ్ముల భయభ్రాంతులకు గురి చేసిన కూడా మా ఉద్యోగ భద్రత విషయంలో వెనుక తగ్గే ప్రత్యక్ష లేదంటూ సమ్మె యదా విధంగా కొనసాగుతుందని ఉద్యోగులు స్పష్టం చేశారు.
JPS Strike: రెగ్యులరైజ్ చేయాల్సిందే.. ప్రభుత్వానికే అల్టిమేటం ఇస్తున్నాం..