మెదక్ జిల్లా తూప్రాన్ లో బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభ నిర్వహించారు. ఈ సభలో ప్రధాని మోదీ పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో మొదటి సారి బిజెపి ప్రభుత్వం ఏర్పాటు కానుందని తెలుగులో మాట్లాడారు. దుబ్బాక, హుజురాబాద్ లో ట్రైలర్ చూశారు…ఇక సినిమా చూస్తారని ప్రధాని మోదీ తెలిపారు. సకల జనుల సౌభాగ్య తెలంగాణ బీజేపీతోనే సాధ్యమన్నారు. నవంబర్ 26 ఘటనలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.. చేతకాని, అసమర్థ నాయకులు దేశాన్ని పాలిస్తే ఇలానే ఉంటుందని ప్రధాని ఆరోపించారు. ఎందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారని ప్రశ్నించారు. గజ్వేల్ లో ఈటల రాజేందర్ పోటీ చేస్తే ఓటమి భయంతో కేసీఆర్ వేరే చోటికి వెళ్లారని విమర్శించారు. గతంలో రాహుల్ గాంధీ కూడా ఇలానే పోటీ చేశారని అన్నారు. ప్రజలకు కలవని ముఖ్యమంత్రి మనకి అవసరమా అని దుయ్యబట్టారు. ఫామ్ హౌస్ లో పడుకునే ముఖ్యమంత్రి మనకి అవసరమా.. సచివాలయానికి వెళ్ళని సీఎం అవసరమా అని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ పై రైతులు కోపంగా ఉన్నారని ప్రధాని తెలిపారు.
China Pneumonia: చైనాలో కొత్త వ్యాధి.. రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు
మల్లన్నసాగర్ ప్రాజెక్టు కట్టి పేద రైతులను రోడ్డు మీద వదిలేశారని ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ వి అన్ని అబద్ధపు హామీలు…ఆయన్ని దేవుడు కూడా క్షమించడని ఆరోపించారు. కేసీఆర్ దళిత సీఎం అని మోసం చేశారని తెలిపారు. దళిత బంధు అంటూ దళితులని మోసం చేశారు.. తెలంగాణ నిరుద్యోగ యువతకి సీఎం మోసం చేశారని అన్నారు. అనేక స్కీముల పేరు చెప్పి స్కాముల చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ అని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలకు ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి కావాలా అని మండిపడ్డారు. ఫామ్ హౌస్ నుంచి పాలన సాగించిన కేసీఆర్ ని ఫామ్ హౌస్ కే పరిమితం చేయాలని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒక్కటేనని పేర్కొన్నారు. ఈ రెండు పార్టీలు కార్బన్ కాగితాలు లాంటివని విమర్శించారు.
Jacqueline Fernandez : స్టన్నింగ్ పోజులతో రెచ్చగొడుతున్న జాక్వెలిన్..
బీజేపీతోనే తెలంగాణ గౌరవం పెరుగుతుందని ప్రధాని మోదీ చెప్పారు. కాంగ్రెస్, కేసీఆర్ ఒక్కటే..ఇద్దరితో జాగ్రత్తగా ఉండాలన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అనే రెండు వ్యాధుల నుంచి తెలంగాణని రక్షించేది బీజేపీనే ప్రధాని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలలో కుటుంబ పాలన కొనసాగుతుందని ఆరోపించారు. ఉమ్మడి కాంగ్రెస్ పాలనలో ఎంతమంది సీఎంలు అయ్యారు.. తెలంగాణ వచ్చాక బీసీల్లో ఎవరైనా సీఎం అయ్యారా అని ప్రశ్నించారు. తెలంగాణలో బీసీని సీఎం చేసేది బీజేపీ పార్టీనేనని తెలిపారు. సామాజిక న్యాయం కేవలం బీజేపీతోనే సాధ్యమన్నారు ప్రధాని మోదీ. తెలంగాణలో మాదిగలకు జరిగిన అన్యాయాన్ని బీజేపీ గుర్తించిందని తెలిపారు. ఒక కమిటీ వేసి మాదిగ సోదరులకు న్యాయం చేస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. కేసీఆర్ తెలంగాణాని లూటీ చేసి దేశాన్ని దోచుకోవడానికి దేశ్ కి నేత అంటున్నారని విమర్శించారు. ఢిల్లీలో ఉన్న అవినీతి పార్టీతో చేయి కలిపి కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ఈ కేసులో ఎవ్వరిని వదలం, ఇది మోదీ గ్యారెంటీ అని అన్నారు.