నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో ప్రజా ఆశీర్వదా సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు వచ్చాయంటే అందరూ వచ్చి వాగ్దానాలు చేస్తూ ఉంటారు.. ఓటర్లు ఒక్కసారి ఆలోచించి ఓట్లు వేయాలని తెలిపారు. ఈ క్రమంలో.. కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ 58 సంవత్సరాల పాలనలో అభివృద్ధి శూన్యమని ఆరోపించారు. అందుకోసం ప్రజలందరూ ఆలోచించాలన్నారు.
మెదక్ జిల్లా తూప్రాన్ లో బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభ నిర్వహించారు. ఈ సభలో ప్రధాని మోదీ పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో మొదటి సారి బిజెపి ప్రభుత్వం ఏర్పాటు కానుందని తెలుగులో మాట్లాడారు. దుబ్బాక, హుజురాబాద్ లో ట్రైలర్ చూశారు...ఇక సినిమా చూస్తారని ప్రధాని మోదీ తెలిపారు. సకల జనుల సౌభాగ్య తెలంగాణ బీజేపీతోనే సాధ్యమన్నారు. న