Medak: మద్యం షాపులో దొంగతనానికి వచ్చిన దొంగ.. కిక్కులో ఏం చేశాడంటే..?
- మద్యం షాపులో దొంగతనానికి వచ్చి ఫుల్లుగా మద్యం తాగి నిద్ర పోయిన దొంగ
- నార్సింగ్‌లోని కనకదుర్గ వైన్స్ లో ఘటన
- ఆదివారం రాత్రి వైన్ షాపు మూసేసి ఇంటికి వెళ్లిన యజమాని
- దొంగతనానికి వచ్చి కౌంటర్ లో నగదు, మద్యం బాటిళ్లు ఓ సంచిలో మూట కట్టుకున్న దొంగ
- దొంగతనం తర్వాత వెళ్ళేటప్పుడు మద్యం తాగడంతో మత్తులోనే నిద్రపోయిన వైనం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డబ్బుల కోసం ఓ మద్యం షాపులోకి దొంగతనానికి వెళ్లిన దొంగకు.. అక్కడ మద్యం బాటిళ్లను చూసే సరికి తాను వచ్చిన పనిని మొత్తం మరిచిపోయాడు. డబ్బులు కొట్టేయడానికి వచ్చిన ఆ దొంగకు మందు సీసాలే ఎక్కువనుకున్నాడు. ఇంకేముంది.. పీకలకాడికి తాగేశాడు. ఆ తర్వాత సోయి తప్పి పడుకున్నాడు. ఉదయం రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. ఈ ఘటన మెదక్ జిల్లా నార్సింగ్ మండల కేంద్రంలో జరిగింది.
Read Also: Maharashtra: క్రికెట్ ఆడుతూ.. గుండెపోటుతో బ్యాట్స్ మెన్ మృతి (వీడియో)
Also Read
- Instagram Love: ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమ పేరుతో మోసం.. ఇద్దరు యువతుల నుంచి రూ.12 లక్షలకు పైగా కాజేసిన కేటుగాడు.!
- Medak: మొబైల్ లో గేమ్స్ ఆడొద్దు అన్నందుకు యువతి షాకింగ్ డెసిషన్
- Wife Kills Husband: 23 ఏళ్ల యువకుడితో అక్రమ సంబంధం.. భర్తను చంపి చెరువులో పడేసిన భార్య
- Gorilla Getup: కోతుల బెడదకు యువత మాస్టర్ ప్లాన్..!
వివరాల్లోకి వెళ్తే.. మద్యం షాపులో దొంగతనానికి వచ్చి ఫుల్లుగా మద్యం తాగి వైన్స్ షాప్ లోనే నిద్ర పోయాడు ఓ దొంగ. నార్సింగ్ మండల కేంద్రంలోని కనకదుర్గ వైన్స్ షాపులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎప్పటిలాగే.. ఆదివారం రాత్రి వైన్ షాపు మూసేసి యజమాని ఇంటికి వెళ్లిపోయాడు. అయితే.. రాత్రి దొంగతనానికి వచ్చిన దొంగ.. కనకదుర్గ వైన్స్‌లో పై కప్పు రేకులు తొలగించి అందులో దూరి దొంగతనానికి ప్రయత్నించాడు. దొంగతనం తర్వాత వెళ్ళేటప్పుడు మద్యం తాగడంతో మత్తులోనే నిద్రపోయాడు. సోమవారం ఉదయం వైన్స్ తెరవగా అందులో ఇతర రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి నిద్రపోయి ఉన్నాడు.
Read Also: Hyderabad: సెల్‌ఫోన్ వాడొద్దని మందలించిన తండ్రి.. కూతురు అదృశ్యం
షాప్ యజమాని మాట్లాడుతూ.. దొంగతనానికి వచ్చి కౌంటర్‌లో నగదు, మద్యం బాటిళ్లు ఓ సంచిలో దొంగ మూట కట్టుకున్నాడని తెలిపాడు. అంతేకాకుండా.. సీసీ కెమెరాలు, హార్డ్ డిస్క్ లు ధ్వంసం చేశాడని అన్నాడు. ఈ ఘటనపై పోలీసులకి సమాచారం ఇవ్వడంతో దొంగని అదుపులోకి తీసుకుని.. అనంతరం ఆస్పత్రికి తీసుకువెళ్లినట్లు చెప్పాడు. కాగా.. మద్యం తాగిన మత్తులో దొంగతనానికి వచ్చిన సంగతి మర్చిపోయి దుకాణంలోనే పడుకొని సంఘటన మండల కేంద్రంలో హాట్ టాపిక్ గా మారింది.
తాజావార్తలు
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
Harish Rao: జూన్ 30, 2025… తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో ఒక చీకటి రోజు..
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
God Of War : త్రివిక్రమ్‌తో సినిమా కోసం ఎన్టీఆర్ – అల్లు అర్జున్ ఎందుకు పోటీపడ్డారు.. ఇన్ సైడ్ స్టోరీ
-
Gold & Silver Prices Today: సామాన్యుల్లో చిగురిస్తున్న ఆశలు.. భారీగా పడిపోయిన గోల్డ్ ధరలు
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్‌లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్‌తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్‌ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్‌లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!