మద్యం షాపులో దొంగతనానికి వచ్చి ఫుల్లుగా మద్యం తాగి వైన్స్ షాప్ లోనే నిద్ర పోయాడు ఓ దొంగ. నార్సింగ్ మండల కేంద్రంలోని కనకదుర్గ వైన్స్ షాపులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎప్పటిలాగే.. ఆదివారం రాత్రి వైన్ షాపు మూసేసి యజమాని ఇంటికి వెళ్లిపోయాడు. అయితే.. రాత్రి దొంగతనానికి వచ్చిన దొంగ.. కనకదుర్గ వైన్స్‌లో పై కప్పు రేకులు తొలగించి అందులో దూరి దొంగతనానికి ప్రయత్నించాడు. దొంగతనం తర్వాత వెళ్ళేటప్పుడు మద్యం తాగడంతో మత్తులోనే నిద్రపోయాడు.