NTV Telugu Site icon

IAS Officers Transferred: తెలంగాణలో 44 మంది ఐఏఎస్ లను బదిలీలు..

Telangana Ias Tranfor

Telangana Ias Tranfor

IAS Officers Transferred: రాష్ట్రంలో 28 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందే.. పలువురు జిల్లా ఎస్పీలు, ఆ స్థాయి అధికారులు బదిలీ అయ్యారు. అయితే ఇప్పుడు తాజాగా.. తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. 44 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రోనాల్డ్ రోజ్‌ను విద్యుత్ శాఖకు బదిలీ చేయడంతో ఆమ్రపాలి కాటాను GHMC కమిషనర్‌గా నియమించారు. జీఏడీ ప్రధాన కార్యదర్శిగా సుదర్శన్‌రెడ్డిని ప్రభుత్వం నియమించింది. పశుసంవర్ధక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా సవ్యసాచి ఘోష్, లేబర్ ఎంప్లాయిమెంట్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా సంజయ్ కుమార్, యువజన సర్వీసులు, టూరిజం, స్పోర్ట్స్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా వాణీ ప్రసాద్‌లను తెలంగాణ ప్రభుత్వం నియమించింది.

Read also: College Student: ప్రేమికుడి మోసం.. ఫ్లైఓవర్‌పై నుండి దూకి యువతి ఆత్మహత్యాయత్నం!

స్పోర్ట్స్ ఎండీగా బాలాదేవి ఐఎఫ్ఎస్ నియమితులయ్యారు. ఇక విద్యుత్ శాఖ కార్యదర్శిగా రోనాల్డ్ రోస్ నియామకమయ్యారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కమిషనర్‌గా ఏవీ రంగనాథ్ ఐపీఎస్ నియమించింది. హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా సర్ఫరాజ్ అహ్మద్ ఐఏఎస్ గా నిమయించింది. ఆర్ అండ్ బి ప్రత్యేక కార్యదర్శిగా హరిచందన ఐఏఎస్ ను నిమించింది. టూరిజం ఎండీ ప్రకాష్ రెడ్డి ఐపీఎస్ ను నియమితులయ్యారు. హౌసింగ్ స్పెషల్ సెక్రటరీగా గౌతం ఐఏఎస్ నియమించారు. అలుగు వర్షిణి ఐఏఎస్ సాంఘిక సంక్షేమ విద్యాశాఖ కార్యదర్శిగా.. వాటర్ బోర్డు ఎండీగా అశోక్ రెడ్డి ఐఏఎస్ నియమించారు. ఐటీ డిప్యూటీ సెక్రటరీగా భవిష్ మిశ్రా ఐఏఎస్.. కాలుష్య నియంత్రణ కార్యదర్శిగా జి. రవి ఐఏఎస్‌ ను నియమించింది ప్రభుత్వం. మత్స్యశాఖ డైరెక్టర్‌గా ప్రియాంక అలా ఐఏఎస్‌ కాగా.. టూరిజం డైరెక్టర్‌గా త్రిపాఠి ఐఏఎస్ ను నియమితులయ్యారు. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా నరసింహారెడ్డి IAS బాధ్యతలు ఇచ్చారు.
Hyderabad Crime: ఘట్‌కేసర్‌లో మాజీ ఎంపీటీసీ మర్డర్ అప్డేట్..! రూంలో బంధించి.. పారతో దాడి

Show comments