DGP Ravi Gupta: ట్రాఫిక్ నియంత్రణపై NSS (నేషనల్ స్టూడెంట్ సర్వీస్) వాలంటీర్లకు శిక్షణ మొదలు పెడుతున్నట్లు డీజీపీ రవిగుప్త తెలిపారు. మొదటి బ్యాచ్ శిక్షణను డీజీపీ రవి గుప్తా, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్రా వెంకటేశం, సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించనున్నారు. వివిధ కాలేజీలకు చెందిన వాలంటీర్లకు బ్యాచుల వారిగా పోలీసులు శిక్షణ ఇవ్వనున్నారు. మొదటి బ్యాచ్ లో 100 మంది వాలంటీర్లకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. శిక్షణ అనంతరం ట్రాఫిక్ క్రమబద్దీకరణలో వాలంటీర్లు భాగస్వామ్యం కానున్నారు. శిక్షణ వల్ల విద్యార్థులకు సోషల్ రెస్పాన్సిబిలిటీ పెరగడంతోపాటు ట్రాఫిక్ పై అవగాహన కలుగుతుందని తెలిపారు. ట్రాఫిక్ రెగ్యులరైజేషన్ కి సంబంధించిన సమస్యలు మనమందరం ఫేస్ చేస్తున్నామన్నారు.
Read also: Hyderabad Crime: ఘట్‌కేసర్‌లో మాజీ ఎంపీటీసీ మర్డర్ అప్డేట్..! రూంలో బంధించి.. పారతో దాడి
ట్రాఫిక్ రూల్స్, నిబంధనలను ప్రతి ఒక్కరు పాటించాలన్నారు. పాదచారులు కావచ్చు వాహనాలను డ్రైవ్ చేసేవారు ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని కోరారు. దేశ వ్యాప్తంగా 11 శాతం రోడ్డు ప్రమాదాల్లో తెలంగాణా ఉందన్నారు. ట్రాఫిక్ లో అంబులెన్స్ వెళ్లాలన్నా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాయన్నారు. స్కూలు స్థాయి నుండి విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్ అవగాహన కల్పిస్తున్నామన్నారు. సిగ్నల్స్ ఎలా క్రాస్ చేయాలి అనేది.. వాళ్ళకి సిగ్నల్స్ దగ్గరికి తీసుకొని వెళ్లి చూపిస్తున్నామని అన్నారు. ట్రాఫిక్ రెగ్యులరైజ్ చేయడంలో ఎన్ఎస్ఎస్ విద్యార్థులు భాగస్వామి కావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. సమాజం ముందుకు వచ్చి ట్రాఫిక్ సమస్యల పరిష్కరించడంలో భాగస్వామ్యం కావాలన్నారు. రోడ్డు ప్రమాదాలు కేవలం మనవళ్ళనే కాదు ఎదుటి వాళ్ళతో కూడా జరుగుతాయన్నారు. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. మరో రెండు రోజుల్లో మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం జరగబోతుందన్నారు.
Read also: Police Firing: సైదాబాదులో పోలీసుల కాల్పులు.. అదుపులో చైన్ స్నాచర్..
ఈ సందర్భంగా శిల్పకళావేదికలో భారీ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. స్కూల్ విద్యార్థినిల్లో సేఫ్టీ టచ్ కు సంబంధించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్రంలో మహిళల భద్రత కోసం పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. మరోవైపు సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ట్రాఫిక్ వల్ల ఇబ్బంది పడని వారు ఎవరు లేరన్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం విద్యార్థులకు శిక్షణ ఇచ్చి వారిని భాగస్వామ్యం చేయాలని భావించామన్నారు. ఈ ఆలోచనలో భాగంగా విద్యాశాఖ సెక్రటరీ బుర్ర వెంకటేశం గారిని కలిసానని తెలిపారు. తమ వద్ద 30 వేల మంది ఎన్ఎస్ఎస్ సైన్యం ఉందని చెప్పారన్నారు. దీంతో NSS వాలంటీర్లకు ట్రాఫిక్ క్రమబద్దీకరణ పై శిక్షణ ఇవ్వాలని భావించామన్నారు. ట్రాఫిక్ నియమాలు పాటించక పోవడం వల్ల సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయన్నారు. ట్రాఫిక్ నియమాల పట్ల ప్రతి ఒకరు అవగాహన కలిగి ఉండాలన్నారు. బేసిక్ ట్రాఫిక్ వాయిలేసన్ లపై వాలంటీర్లకు ట్రైనింగ్ ఇస్తామన్నారు. NSS వాలంటీర్లకు శిక్షణ ఇచ్చి ట్రాఫిక్ క్రమబద్ధీకరణ లోభాగస్వామ్యం చేస్తామన్నారు. వీరి సేవలను ఉపయోగించు కుంటామన్నారు.
TG Inter Supply Results: ఇవాళ టీజీ ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు..