కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ మాట్లాడుతూ… ఎన్నికల కమిషన్ హుజురాబాద్ ఉప ఎన్నిక పై అదుపు తప్పింది. కోట్లు డబ్బులు పంచుతున్న పట్టించుకోవడం లేదు. హుజురాబాద్ లో బీజేపీ,కాంగ్రెస్ పార్టీల మద్యే పోటీ అని చెప్పారు. టీఆరెస్ పార్టీ హుజురాబాద్ లో దసరా పండుగ కు డబ్బులను ఏరులై పారించింది. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరల పైన తెలంగాణ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు. ఇంటికో నిరుద్యోగి ఉన్నాడు కాబట్టి అసమస్యను ఎత్తి చూపడానికె వెంకట్ ని ఎంపిక చేశాం అని తెలిపారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను జనంలోకి తీసుకెళ్తాము. హరీష్ రావు డబ్బులతో గెలవాలని అనుకుంటున్నారు. కేటీఆర్ ఇది చిన్న ఎన్నిక అంటున్నారు. కాళేశ్వరం అవినీతి డబ్బులు ఎన్నికల్లో పెడుతున్నారు.. బీజేపీ, టీఆరెస్ రెండూ ఒక్కటే.. బీజేపీ కంటే ముందే అభ్యర్థిని ప్రకటించాం. 224 గంటల సమయం ఉంది. అది చాలు మాకు అని పేర్కొన్నారు.