ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు. ఎగ్జిట్ పోల్స్ అంచానాల మేరకు ఈటల విజయం సాధించారు. ఐతే, ఈటలకు ఈ స్థాయిలో మెజార్టీ లభిస్తుందని ఎవరూ ఊహించలేదు. దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికగా విశ్లేషకులు దీనిని అభివర్ణించారు. సీఎం కేసీఆర్ హుజురాబాద్ ఉప ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసున్నారు. నాలుగు నెలల సుదీర్ఘ ప్రచారంతో హైవోల్టేజీ ఎలక్షన్‌గా మారింది. హుజూరాబాద్‌లో టఫ్ ఫైట్ తప్పదని మొదటి…
హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్‌కు ఇంకా కొన్ని గంటల సమయమే ఉంది. ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఎన్నికలకు కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీ హోరా హోరీ ప్రచారం నిర్వహించాయి. ప్రచారపర్వం ముగిసిన క్షణం నుంచి ప్రలోభాల పర్వం మొదలైంది. ఇప్పుడు నియోజకవర్గంలో ఓటర్ల కొనుగోలు కార్యక్రమం ముమ్మరంగా సాగుతున్నట్టు కనబడుతోంది. ఒక్క ఓటుకు వేలల్లో ధర పలుకుతున్నట్టు సమాచారం. పార్టీల నుంచి డబ్బు అందని ఓటర్లు రోడ్డెక్కి ధర్నాలకు దిగటం ఈ ఎన్నికల్లో హైలైట్. ఇలాంటివి గతంలో ఎన్నడూ…
హుజూరాబాద్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. రేపు ఇక్కడి నుండే ఈవీఎం , పోలింగ్ సామగ్రి తీసుకొని తమకు కేటాయించిన పోలింగ్ స్టేషన్స్ కి పోలింగ్ సిబ్బంది వెళ్లనున్నారు. ఈ ఎన్నికలో మొత్తం 306 పోలింగ్ స్టేషన్స్ ఉండగా… 2 లక్షల 37 వేల 36 మంది ఓటర్లు ఉన్నారు. అయితే కోవిడ్ ప్రోటోకాల్ తో పోలింగ్ జరగనుంది. ప్రతి పోలింగ్ స్టేషన్ లో హెల్త్ సిబ్బంది ఉంటారు. ఓటర్ కి ఓటర్ కి…
హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితం తెలంగాణ భవిష్యత్ రాజకీయ గమనాన్ని నిర్ధేశించనుంది. కేసీఆర్ ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అవినీతి ఆరోపణలతో రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. ప్రతిపక్ష పార్టీలు కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా బలమైన ఓ ప్రచార నినాదాన్ని నిర్మించడానికి హుజూరాబాద్ విజయం దోహదం చేస్తుంది. టీఆర్‌ఎస్ గెలిస్తే పార్టీపై కేసీఆర్ ఉక్కు పిడికిలి మరింత బిగుసుకుంటుంది. సమీప భవిష్యత్తులో…
హుజురాబాద్ ఉప ఎన్నిక తెలంగాణతో పాటు దేశం దృష్టిని కూడా ఆకర్షిస్తోంది. ఈ ఎన్నికను దేశంలోనే అత్యంత ఖరీదైనదిగా రాజకీయ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఒక్క రోజు ప్రచారంలో లక్షలు ఖర్చు పెడుతున్నారు. పొద్దుగూకితే చాలు గ్రామాల్లో మద్యం ఏరులవుతుంది. ఇదే సమయంలో రాజకీయం రంజుగా సాగుతోంది. రాత్రికి రాత్రి గ్రామ స్థాయి నాయకులను బట్టలో వేసుకుంటున్నారు. విందులు, వినోదాలతో పాటు కరెన్సీ కట్టలతో వారిని కట్టిపడేస్తున్నారు. మూడు ప్రధాన పార్టీలూ ఈ తరహా రాజకీయంలో ఆరితేరాయి. కాస్తా…
హుజురాబాద్ ఉప ఎన్నికలో గెలిచేందుంకు టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు తమదైన శైలిలో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక అన్నప్పటినుంచి అక్కడే ఉంటున్న ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రజలను టీఆర్‌ఎస్ కు ఓట్లు వేసేందుకు వివిధ వరాలను గుప్పిస్తున్నారు. గురువారం జమ్మికుంట మండలం మాడిపల్లిలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో హరీశ్‌రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ గెలవనే గెలవదు.. గెల్చినా ఈటల మంత్రి అయ్యేది ఉందా.. నియోజకవర్గ పనులు చేసేది…
తెలంగాణలో జరగబోయే హుజూరాబాద్ ఎన్నికలపై మండిపడ్డారు సీపీఐ నేత నారాయణ. తెలంగాణాలో జరిగే ఎన్నికలు పగటి డ్రామాలా లేక పవిత్ర ఎన్నికల విధానాలా అని విమర్శించారు. ఎన్నికల విధానాలను భ్రష్టు పట్టించేవిగా వున్నాయన్నారు. ముందస్తు ప్రణాళికలో భాగం గానే దళిత బంధు పథకాన్ని ప్రారంభించారని, అయితే అందులో కూడా దళిత బంధు ఇచ్చినట్టే వుండాలి. పథకం ప్రయోజనాలు లబ్ధిదారులకు అందకూడదన్న చందంగా తయారైందన్నారు. కూడు కుండనిండుగుండాలి , బిడ్డమాత్రం బొద్దుగుండాలి ” అన్నట్టుగా వుందన్నారు నారాయణ. ఈనాటకాలలో…
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ మాట్లాడుతూ… ఎన్నికల కమిషన్ హుజురాబాద్ ఉప ఎన్నిక పై అదుపు తప్పింది. కోట్లు డబ్బులు పంచుతున్న పట్టించుకోవడం లేదు. హుజురాబాద్ లో బీజేపీ,కాంగ్రెస్ పార్టీల మద్యే పోటీ అని చెప్పారు. టీఆరెస్ పార్టీ హుజురాబాద్ లో దసరా పండుగ కు డబ్బులను ఏరులై పారించింది. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరల పైన తెలంగాణ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు. ఇంటికో నిరుద్యోగి ఉన్నాడు కాబట్టి అసమస్యను ఎత్తి…
ఇవాళ హుజురాబాద్ ప్రచారంలో పాల్గొన్న వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 200కిలో మీటర్ల దూరం నుండి హుజురాబాద్‌కు వచ్చానని… రేపు రాబోయే తెలంగాణ ఫలితాలకు హుజురాబాద్ వేదిక కాబోతుందని..ఒక్కరు కూడ తప్పు చేయవద్దని తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రిగా హుజురాబాద్ లో కాలు మోపడం సంతోషంగా ఉందన్నారు. అత్యధిక మందికి ఆహారం అందించేది, ఉపాధి ఇచ్చేది వ్యవసాయ రంగమని… తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని బలోపితం చేయడం వల్లే అభివృద్ది సాధ్యం…