రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మంచిరేవులలో ఉన్న సర్వే నంబర్ 491 భూమి ప్రస్తుతం వివాదస్పదంగా మారింది. ‘స్వస్తిక హౌసింగ్ సొసైటీ’ (Swastika Housing Society) , ‘నార్సింగి ఓల్డ్ ముస్లిం శ్మశాన వాటిక కమిటీ’ (Old Muslim Graveyard Committee) మధ్య ఈ స్థలం విషయంలో కొన్నేళ్లుగా రగడ సాగుతోంది. తాజాగా ఈ స్థలంలో సర్వే నిర్వహించడంతో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. 1982లో స్వస్తిక కోఆపరేటివ్ సొసైటీ సుమారు 4 ఎకరాల 18 గుంటల భూమిని హైదర్ అలీ…