AP Crime: విశాఖపట్నంలోని ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో డిగ్రీ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.. మృతుడు సాయి తేజ.. ఎంవీపీలోని సమత కాలేజ్ లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.. ఈ రోజు ఉదయం విద్యార్థి సాయి తేజ ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందినట్లు బంధువులు చెబుతున్నారు.. విద్యార్థి సాయి తేజ మృతికి కాలేజీ లెక్చరర్ లైంగిక వేధింపులు, మానసిక వేధింపులు కారణమని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.. గత కొద్దిరోజుల నుంచి వేధింపులు ఎక్కువ…
ప్రేమించిన యువతి ఇంటి ముందు ప్రేమికుడు ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన మైలార్దేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాగ్ లింగంపల్లికి చెందిన సోను (21) డిగ్రీ స్టూడెంట్. హౌసింగ్ బోర్డ్ కాలనీ, బృందావనం కాలనీకి చెందిన అంబిక (21) ఎల్‌ఎల్‌బీ స్టూడెంట్. ఇద్దరు గత మూడు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు.
Medak Crime: డిగ్రీ విద్యార్థినిపై పట్టపగలు ఓ ప్రేమోన్మాది కత్తితో దాడి చేసిన దారుణ ఘటన మెదక్ పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓపెన్ డిగ్రీ పరీక్షలు రాసేందుకు యువతి వచ్చింది.
Degree student commits suicide in Palnadu: పల్నాడు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆన్ లైన్ రుణ వేధింపులు తాళలేక ఓ డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఈపూరు మండలం ఎర్రగుంట తండాలో జరిగింది. వడ్డీకి వడ్డీ పెరిగిపోవడం, ఇంటికి వచ్చి బెదిరించడంతో మానసికంగా కృంగిపోయిన ఆ విద్యార్థి చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. డిగ్రీ విద్యార్థి బాలస్వామి నాయక్ గత ఏడాది ఆన్ లైన్‌లో రుణం తీసుకున్నాడు. వడ్డీకి వడ్డీ…
Hyderabad: ఇటీవల కాలంలో విద్యార్థులు, చిన్నారులు మొబైల్‌లో గేమ్ ఆడేందుకు మాత్రమే మొగ్గు చూపుతున్నారు. అయితే మొబైల్‌లో ఉండే పేమెంట్ యాప్స్, బ్యాంక్ యాప్‌లకు చాలా మంది సెక్యూరిటీ కోడ్‌లను పెట్టుకోవడం విస్మరిస్తున్నారు. దీంతో చిన్నారులు లేదా విద్యార్థులు తమ తల్లిదండ్రుల మొబైల్ తీసుకుని గేమ్ ఆడిన సందర్భాలలో డబ్బులు గుల్ల చేస్తున్నారు. ఇలాంటి ఘటన తాజాగా తెలంగాణలో జరిగింది. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్ గ్రామంలో ఫోన్ గేమ్‌లకు అలవాటు పడ్డ హర్షవర్ధన్ అనే…
మంచిర్యాల జిల్లాలో యువతి బావతో పెళ్లి కాదేమోననే నిరాశతో ఆత్మహత్య చేసుకుంది. కోటపల్లి మండలం జనగామ గ్రామానికి చెందిన పడాల హరిప్రియ అనే డిగ్రీ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఇది గమనించి ఆమె అమ్మమ్మ, యువతి తల్లిదండ్రులను అప్రమత్తం చేసింది. ఆమెను చెన్నూర్ లోని ఆసుపత్రికి తరలించగా ఆమె మరణించింది. మేన బావతో పెళ్ళి కాదేమోననే బెంగతోనే ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు.