Sanju Samson: సంజూ.. నెదర్లాండ్స్ లేదా ఐర్లాండ్ తరఫున ఆడు! 2027 ప్రపంచకప్‌లో ఆడుతావ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Fans Slams BCCI over Sanju Samson: ప్రపంచకప్ 2023 అనంతరం సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్ ఆడేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఈ సిరీస్ కోసం 15 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించింది. ప్రపంచకప్ 2023లో ఆడిన సీనియర్లకు విశ్రాంతినిచ్చిన బీసీసీఐ.. కుర్రాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది. అయితే చాలాకాలం నుంచి జట్టులో చోటు కోసం ఎదురు చూస్తున్న కేరళ వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. సంజూకు బీసీసీఐ సెలెక్టర్లు టీ20 జట్టులో కూడా చోటు ఇవ్వలేదు. దాంతో అతడి పేరు సోషల్ మీడియాలో మరోసారి ట్రెండింగ్ అవుతోంది.
భారత్ తరఫున ఆడే అవకాశం వచ్చిన ప్రతిసారి సంజూ శాంసన్ రాణించాడు. అయినా కూడా బీసీసీఐ అతడికి అవకాశాలు మాత్రం ఇవ్వడం లేదు. 2015లో అరంగేట్రం చేసిన సంజూ.. ఇప్పటివరకు 13 వన్డేలు, 24 టీ20లు మాత్రమే ఆడాడంటే బీసీసీఐ అతనిపై ఎంత వివక్ష చూపుతుందో ఇట్టే అర్ధమవుతోంది. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో సంజూ ఆడతాడని అనుకున్నా.. అది జరగలేదు. వన్డే ప్రపంచకప్ కోసం రెడీ చేస్తున్నామని, అందుకే వన్డేలు ఆడిస్తున్నామని బీసీసీఐ చెప్పింది. అయితే ఈ ఏడాది ఆరంభం నుంచి టీ20ల్లోనే ఆడించింది. ఆసియా కప్ 2023లో ఆడిస్తారనుకుంటే.. టోర్నీకి కూడా ఎంపిక చేయలేదు. కనీసం ఆసియా క్రీడలకు పంపుతారనుకున్నా అది జరగలేదు.
Also Read
- Tilak Varma: "నమ్మకమే నా బలం.." అలా ఆడడం అంటే ఎంతో ఇష్టం..!
- Mumbai Indians Win: తిలక్ వర్మ తుఫాన్ ఇన్నింగ్స్ దెబ్బ.. పంజాబ్ అబ్బా..
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్‌దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్‌కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ప్రపంచకప్ 2023 తర్వాత ఆస్ట్రేలియాతో జరగనున్న టీ20 సిరీసులో అయినా సంజూ శాంసన్‌కు అవకాశం ఇస్తారనుకున్నా.. మళ్లీ నిరాశే ఎదురైంది. టీ20 జట్టులో సంజూ పేరు లేకపోవడంతో భారత క్రికెట్ అభిమానులు బీసీసీఐపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2023 ప్రపంచకప్‌లో సూర్యకుమార్ యాదవ్ ఏం పొడిచాడని సారథిగా ఎంపిక చేశారని బీసీసీఐపై మండిపడుతున్నారు. సూర్య కంటే బాగా ఆడే సంజూ ఏం పాపం చేశాడని ట్వీట్స్ చేస్తున్నారు.
Also Read: Rohith Sharma: బాధపడొద్దు రోహిత్.. గొప్ప నాయకులకు కూడా చెడ్డ రోజులు ఉంటాయి: రాధికా
‘సంజూ శాంసన్ స్థానంలో అర్హత లేని ఆటగాళ్లు జట్టులోకి వస్తున్నారు’, ‘బీసీసీఐ రాజకీయాల కారణంగానే సంజూకు భారత జట్టులో చోటు దక్కడం లేదు’, ‘ఏం చేస్తే సంజూకు జట్టులో చోటు దక్కుతుందో బీసీసీఐ చెప్పాలి?’ అని ఫాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఓ అభిమాని అయితే రిటైర్మెంట్ ఇచ్చేసి.. నెదర్లాండ్స్ లేదా ఐర్లాండ్ తరఫున ఆడు అని సలహా ఇచ్చాడు. ‘రిటైర్ అయ్యి.. అమెరికా, నెదర్లాండ్స్ లేదా ఐర్లాండ్‌కు ఆడు. వన్డే ప్రపంచకప్ 2027లో టీమిండియాకు వ్యతిరేకంగా ఓ కెప్టెన్‌గా ఎదుర్కో’ అని ట్వీట్ చేశాడు.
Sanju Samson once again not picked for for T20I series against India. Players out of no where coming into the setup to replace him.
It’s high time Sanju Samson should retire himself to play for USA, Netherlands or Ireland and face India as captain in ODI World Cup 2027.… pic.twitter.com/VI9BTRMi1X
— Himanshu Pareek (@Sports_Himanshu) November 20, 2023
JUSTICE FOR SANJU SAMSON !!!!!
He’s very experienced as a captain and should be called back into the side as Surya Kumar yadav failed to perform in the world cup . He deserves to be t20is captain pic.twitter.com/nepJgTZtKb
— Kanhaiya Lal Saran (@SaranKL_) November 20, 2023
• Asian Games ❎
• Asia Cup ❎
• Australia ODI Series ❎
• WorldCup 2023 ❎
• Australia T20i Series ❎Wait continues for Sanju Samson!#SanjuSamson #CricketTwitter pic.twitter.com/MsRHzzxqaP
— Ishan Joshi (@ishanjoshii) November 20, 2023
తాజావార్తలు
-
Peddi: ‘పెద్ది’ రిలీజ్‌కు భారీ షాక్..
-
Delhi Work From Home: ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. పొదుపు చర్యల జాబితా విడుదల
-
Jasprit Bumrah: “ఇక మిగిలింది వన్డే కెప్టెన్సీనే.. కానీ!”.. కెప్టెన్‌గా తొలి విజయంపై జస్ప్రీత్ బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Dragon: నేషనల్ మీడియా సమక్షంలో ‘డ్రాగన్’ ఫస్ట్ గ్లింప్స్ లాంచ్!
-
Tilak Varma: “నమ్మకమే నా బలం..” అలా ఆడడం అంటే ఎంతో ఇష్టం..!
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!