Mallu Ravi Demands To Take Action On Komatireddy Venkata Reddy: వచ్చే ఎన్నికల్లో పొత్తులపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్‌కు నష్టం కలిగించే విధంగా వెంకటరెడ్డి మాట్లాడారని, ఇప్పటి స్టేట్‌మెంట్ బీజేపీకి అనుకూలంగా ఉందని మండిపడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు కలిసి పోటీ చేస్తారని బండి సంజయ్ మాట్లాడటానికి.. వెంకటరెడ్డి వ్యాఖ్యలే కారణమని దుయ్యబట్టారు. కోమటిరెడ్డి మాట్లాడే మాటలు కాంగ్రెస్ క్యాడర్‌ను గందరగోళం పరిచే విధంగా ఉన్నాయని, ఇది కాంగ్రెస్ కార్యకర్తలని అసంతృప్తికి గురిచేస్తుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కి మంచి మెజార్టీ వచ్చే అవకాశం ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో వెంకటరెడ్డి పదేపదే చేస్తున్న వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
DK Aruna: బీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు ఖాయం.. మేం చెప్పింది నిజమని రూఢీ చేసేలా వెంకటరెడ్డి వ్యాఖ్యలు
కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. పదేపదే బీజేపీకి ప్రయోజనం చేకూర్చే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇది క్రమశిక్షణను ఉల్లంఘించటమేనని మల్లు రవి పేర్కొన్నారు. వెంకటరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అధిష్టానానికి లేఖ రాస్తామన్నారు. గతంలోనూ వెంకటరెడ్డికి షోకాజ్ నోటీసు ఇచ్చామని, అయితే ఆ నోటీసుని చెత్త బుట్టలో వేసేశారని చెప్పారు. వెంకటరెడ్డి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో పోటీ చేసినప్పుడు.. కాంగ్రెస్‌కు తీవ్ర నష్టం కలిగించారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తు ఉండదని రాహుల్ గాంధీ గతంలోనే స్పష్టం చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో హంగ్ వస్తుందని వెంకటరెడ్డి అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వెంకటరెడ్డిపై చర్యలు తీసుకొని, కాంగ్రెస్‌ను కాపాడాల్సిందిగా అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు.
Cheteshwar Pujara: అరుదైన రికార్డుకు చేరువలో పుజారా.. రెండో టెస్టు ఆడితే!
ఇదిలావుండగా.. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని న్యూఢిల్లీలో కలిసిన తర్వాత వచ్చే ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా స్వంతంగా 60 సీట్లు దక్కవని, అప్పుడు కాంగ్రెస్‌తో కేసీఆర్ పొత్తు పెట్టుకుంటారని కుండబద్దలు కొట్టారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు సెక్యులర్ పార్టీలని.. అందుకే ఈ రెండు పార్టీలు కలుస్తాయని ఆయన జోస్యం చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని, ఎన్నికల తర్వాత పొత్తులుంటాయని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే మల్లు రవి పైవిధంగా స్పందించారు.