Prabhas Fauji: ప్రభాస్ కోసం హైదరాబాద్‌లో మరో ‘చార్మినార్’.. ‘ఫౌజీ’కి భారీ సెటప్ రెడీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhas Fauji: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా అంటే ప్రతి అప్డేట్ ను అభిమానులు పండగలా జరుపుకుంటారు. ఇప్పుడు అలాంటి మరో ఆసక్తికరమైన వార్త అభిమానుల్లో మరింత జోష్ ను పెంచుతోంది. మామూలుగా చార్మినార్ అంటే హైదరాబాద్ పాతబస్తీనే మనకు గుర్తుకు వస్తుంది. కానీ త్వరలో గచ్చిబౌలిలో కూడా మరో ‘చార్మినార్’ కనిపించబోతోంది. అయితే అది చారిత్రక కట్టడం కాదు, ప్రభాస్ నటిస్తున్న భారీ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’ కోసం ప్రత్యేకంగా నిర్మిస్తున్న సినిమా సెట్ అది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ మూవీ ప్రస్తుతం కీలక దశకు చేరుకుంది. సినిమా తదుపరి షెడ్యూల్ కోసం గచ్చిబౌలి–లింగంపల్లి రోడ్డులోని అల్యూమినియం ఫ్యాక్టరీ ప్రాంగణంలో అసలు చార్మినార్‌ను పోలిన భారీ సెట్ ను చిత్ర బృందం నిర్మిస్తోంది. ఈ సెట్లోనే సినిమాలోని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఆగస్టు 3 నుంచి ప్రారంభమైన 25 రోజుల షెడ్యూల్లో ప్రభాస్ పాల్గొననున్నారు. ఈ షెడ్యూల్ పూర్తయ్యే సమయానికి సినిమా షూటింగ్ దాదాపు 90 శాతం పూర్తవుతుందని సమాచారం. దీంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా పూర్తి చేసి నిర్ణయించిన సమయానికే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.
అసలు చార్మినార్ వద్ద షూటింగ్ చేయకుండా ప్రత్యేక సెట్ నిర్మించడం వెనుక బలమైన కారణం కూడా ఉంది. ప్రభాస్‌కు ఉన్న భారీ అభిమాన గణం కారణంగా పాతబస్తీలో షూటింగ్ నిర్వహిస్తే వేలాది మంది అభిమానులు అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. దీంతో ట్రాఫిక్ సమస్యలు, భద్రతా ఏర్పాట్లు, షూటింగ్ అంతరాయం వంటి అనేక సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. అందుకే అదే వాతావరణాన్ని గచ్చిబౌలిలో భారీ సెట్ వేసి నిర్మించాలని చిత్ర బృందం నిర్ణయించింది. దీంతో షూటింగ్ కూడా ఎలాంటి అంతరాయం లేకుండా సజావుగా సాగనుంది. ఇదిలా ఉండగా ‘ఫౌజీ’ విడుదలపై వస్తున్న పుకార్లకు కూడా నిర్మాతలు ఇటీవలే చెక్ పెట్టారు. సినిమా వాయిదా పడుతుందనే ప్రచారం జరిగినప్పటికీ, నిర్మాత రవిశంకర్ అధికారికంగా స్పందిస్తూ మొదట ప్రకటించిన తేదీ ప్రకారమే డిసెంబర్ 3, 2026న ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని స్పష్టం చేశారు. దీంతో ప్రభాస్ అభిమానుల్లో ఉత్సాహం ఉరకలు వేస్తోంది.
Also Read
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ సుమారు రూ.700 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఈ సినిమాతో ఇమాన్వి తెలుగు తెరకు కథానాయికగా పరిచయం అవుతుండగా, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద తదితర ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ పీరియడ్ రొమాంటిక్ వార్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు తో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పుడు గచ్చిబౌలిలో నిర్మిస్తున్న భారీ ‘చార్మినార్’ సెట్ వార్తతో ‘ఫౌజీ’పై మూవీపై ఆసక్తి మరింత పెరిగింది.
తాజావార్తలు
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!