Varanasi : ‘వారణాసి’కి నాలుగేళ్లు.. ఇంకా చెక్కుతూనే ఉన్న జక్కన్న
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు, మలయాళ స్టార్ హీరో పృథ్వి రాజ్ సుకుమారన్, హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కాంబోలో వస్తున్నా భారీ చిత్రం ‘వారణాసి’. ఈ సినిమా ప్రయాణం మొదలై ఇప్పటికి నాలుగేళ్లు పూర్తయింది. ఇటీవల ఒక అంతర్జాతీయ మీడియాతో మాట్లాడిన రాజమౌళి ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన వివరాలను పంచుకున్నారు.
2022లో ఈ చిత్ర కథ రాయడం మొదలుపెట్టాం అదే ఏడాది సెప్టెంబర్‌లో ఫొటోషూట్ నిర్వహించాము. 2023 ఫిబ్రవరిలో గ్రాండ్‌గా షూటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం ఇంకా 20 శాతం షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. రాబోయే అక్టోబర్ నాటికి మొత్తం చిత్రీకరణ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. నేను చిన్నప్పటి నుండి హాలీవుడ్ మూవీస్ చూస్తూ పెరిగాను. ఆ ప్రభావం ఖచ్చితంగా నా సినిమాలపై ఉంటుంది. నాకు ఎంతో ఇష్టమైన ‘ఇండియానా జోన్స్’ తరహా కథాంశంతోనే ఈ ‘వారణాసి’ చిత్రాన్ని తెరకెక్కించాను. ఈ కథ వారణాసిలోనే ప్రారంభమై అక్కడే ముగుస్తుందని.. అయితే మధ్యలో ప్రేక్షకులను అంటార్కిటికా, ఆఫ్రికా ఖండాల మీదుగా రామాయణ కాలానికి తీసుకెళ్తుంది. అంటార్కిటికాలోని 300 అడుగుల భారీ మంచు పర్వతాలను, రామాయణ కాలం నాటి భారీ వానర సేనను సినిమాలో ఎంతో అద్భుతంగా చూపించాము. ఈ సీన్స్‌ను అద్భుతంగా, విశాలంగా చూపించాలంటే ఐమాక్స్ ఫార్మెట్ కరెక్ట్. ప్రేక్షకులకు ముందుగానే కథ, నేపథ్యం తెలిస్తేనే వారు సినిమాను మరింతగా ఓన్ చేసుకుంటారని, అందుకే గ్లింప్స్ ద్వారా ‘వారణాసి’ ప్రపంచం ఎలా ఉండబోతోందో ముందే చెప్పామని’ అన్నారు. 2027 ఏప్రిల్ 7న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న వారణాసిపై ఇప్పటికే అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.
Also Read
- Jailer 2 Telugu Trailer: 'జైలర్ 2' ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
- Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!