తిట్లు, బూతుల సంస్కృతి తెచ్చిందే కేసీఆర్ : భట్టి విక్రమార్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపై దుష్ప్రచారం చేసి లబ్ది పొందాలని బీజేపీ ప్రయత్నం చేస్తోంది. జానారెడ్డి లాంటి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పార్టీ మారుతున్నాడంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం అని మల్లు భట్టి విక్రమార్క అన్నారు. జానారెడ్డి లాంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులపై కూడా బీజేపీ ఇలాంటి కట్టు కథలను నాగార్జున సాగర్ ఎన్నికల సమయంలో చెబుతోంది.. దుబ్బాక ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి టీఆర్ఎస్ లో చేరుతున్నారంటూ తప్పుడు వీడియోను రిలీజ్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టించి ఓట్ల లబ్దిని బీజేపీ పొందింది. జానారెడ్డిగారు అత్యంత సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్నారు. ఉన్నత విలువలు, ఆదర్శప్రాయమైన రాజకీయాన్ని ఆయన కొనసాగిస్తున్న వ్యక్తి. జానారెడ్డి గారు ఎప్పుడూ కాంగ్రెస్ లోనే ఉంటారు.. ఆయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు.. అలాంటి వ్యక్తిపైన బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అత్యంత చౌకబారుగా ఉన్నాయి. జానారెడ్డిగారి గురించి తెలిసిన ఏ ఒక్కరు బండి సంజయ్ మాటలను విశ్వసించరు. పదేపదే మైక్ దొరికిందని మాట్లాడ్డం.. సవాళ్లు, ఛాలెంజులు విసరడం.. ఎన్నికలు అయ్యాక కేసీఆర్ తో చేతులు కలపడం సంజయ్ కు షరా మామూలే. దీనిని సాగర్ ప్రజలు గమనించాలని కోరుతున్నా అని అన్నారు.
అలాగే బండి సంజయ్ టీఆర్ఎస్ ఒక్కటే. రైతు చట్టాలను మీదట వ్యతిరేకించిన కేసీఆర్.. ఢిల్లీ వెళ్లి మీ ప్రధానమంత్రిని కలిసిన తరువాత ఒక కాంప్రమైజ్ కు వచ్చి యూ టర్న్ తీసుకున్నారు. టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్ కు రాకుండా మీరు.. అధికార పార్టీ కలిసి ఆడుతున్న రాజకీయ నాటకాన్ని ప్రజలు గుర్తించారు. ఈ ఉప ఎన్నికలో మీ ఇద్దరికి కలిపి ప్రజలు తగిన బుద్ది చెబుతారు. కేటీఆర్ కు కళ్ళు నెత్తికెక్కి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎవడు అని ఏకవచనంతో మాట్లాడుతున్నాడు.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదే కాంగ్రెస్ పార్టీ కాళ్ళ ముందు పడి దేబిరించిన సంగతి కేటీఆర్ మరిచిపోయినట్లు ఉంది.. కేసీఆర్ ని తిడితే కేసులు పెడతామని అంటున్నావు.. అసలు తిట్ల సంస్కారం మొదలు పెట్టింది మీ అయ్య కే చంద్ర శేఖర్ రావే అన్న సంగతి నీకు గుర్తుందా కేటీఆర్.. బూతులు మాట్లాడ్డం, తిట్ల సంస్కారాన్ని రాష్ట్రంలోకి తీసుకువచ్చింది మీ అయ్య కే చంద్రశేఖర్ రావే.. రాష్ట్ర రాజకీయాలను బూతులతో బ్రష్టు పట్టించింది నువ్వూ.. మీ అయ్యనే. ఈ రోజు బూతులు గురించి, తిట్ల గురించి నువ్వు నీతులు చెబితే ఎలా?? యధారాజా.. తథాప్రజా అన్నట్లు మీ అయ్యా ఏది మాట్లాడుతున్నాడో మిగిలిన నాయకులు.. అదే మాట్లాడుతున్నారు.. ముందు నువ్వు మీ అయ్యను ఇలా మాట్లాడకు అని హెచ్చరించు.. అలాగే నువ్వు కూడా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు అని హెచ్చరించారు.
Also Read
- Women Commission : తెలంగాణ మహిళా కమిషన్‌లో ఉద్యమ కుటుంబాలకు చోటు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.!
- CM Revanth Reddy : ప్రభుత్వ విద్యలో తెలంగాణను దేశానికే నంబర్ వన్ చేస్తాం
- Off The Record : కారు స్పీడ్ పెంచేందుకు వ్యూహకర్త రెడీ? కేసీఆర్ కొత్త టీమ్.. పాత జోష్ వస్తుందా?
- HAM Projects : తెలంగాణలో రహదారుల విప్లవం.. 'హ్యామ్' ప్రాజెక్టులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక సమీక్ష
రాష్ట్రంలో ఎన్నికలు మీకు ఒక వ్యాపారంలా మారిపోయాయి. ఎక్కడ ఎన్నికలు అంటే అక్కడకు వెళ్లడం ఎవరిని ఎంతకు కొనాలి అని చూడడం మీకు మామూలుగా అయిపోయింది. అలాగే ఎన్నికలప్పుడే మీకు అభివృద్ధి ప్రకటనలు.. శంఖుస్థాపనలు.. లేనిపోని హామీలు. ఎన్నికలు అనగమే మీకు ఆమె వ్యఓరం.. ఏ నికలడగర్కు పోవడం ఎవరికి ఎంతకు కొనాలని ప్రయటనలు.. లేనిపోని శంఖుస్థాపనలు చేయడం..ఎన్నికలు అయ్యాక వాటిని అక్కడితో వదిలేసి వెళ్లడం మీకు షరా మామూలుగా మారింది. ఇప్పుడు వరంగల్ లో చేస్తున్నది.. సాగర్ లో చెబుతున్న హామీలు మాటలు చెప్పడం అందులో అలాంటివే అన్నది అందరికి తెలుసు అని అన్నారు మల్లు భట్టి విక్రమార్క.
తాజావార్తలు
-
Tollywood : సమ్మర్ అంటే భయపడిపోతున్న స్టార్స్
-
CM Chandrababu: అసోం సీఎం ప్రమాణస్వీకారానికి సీఎం చంద్రబాబు.. గౌహతిలో బిజీ షెడ్యూల్!
-
Krishnavataram Part 1: కృష్ణావతారం మూవీ టికెట్ల ధరపై.. సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక ఆదేశాలు!
-
VeeraBhadrudu : వీరభద్రుడు వచ్చేశాడు.. ట్రైలర్ లో అదరగొట్టిన సూర్య
-
Polavaram-Tiger: పోలవరం జిల్లాలో మళ్లీ పెద్దపులి సంచారం.. భయం గుప్పెట్లో హడలెత్తిపోతున్న జనాలు!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?