Viral Wedding: 17 ఏళ్ల ఇన్ఫ్లుయెన్సర్ కు పెళ్లి.. భర్తతో రొమాంటిక్‌గా పోజులిస్తున్న మైనర్ వధువు.. షాక్‌లో అభిమానులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Wedding: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లను చాలా మంది ఫాలో అవుతుంటారు. ఇక వాళ్ళ పర్సనల్ లైఫ్ విషయాలు కూడా తరచూ వార్తల్లో నిలుస్తుంటాయి. అయితే ఈసారి ఓ 17 ఏళ్ల కంటెంట్ క్రియేటర్ వివాహం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. పాకిస్తాన్‌కు చెందిన ఈ యువ ఇన్ఫ్లుయెన్సర్ రియల్ అజాన్ తన వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. కొందరు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతుండగా, మరికొందరు ఇంత చిన్న వయసులో వివాహం చేసుకోవడంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
అజాన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వివాహ వేడుకకు సంబంధించిన దృశ్యాలను పంచుకున్నాడు. పెళ్లి సందర్భంగా వధూవరులు ఇద్దరూ తెలుపు రంగు దుస్తుల్లో కనిపించారు. అజాన్ తెల్లటి కుర్తా పైజామాతో పాటు అదే రంగు జాకెట్ ధరించగా, వధువు కూడా తెలుపు రంగు సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకుంది. కొన్ని ఫోటోలలో ఆమె ముసుగు ధరించి కనిపించగా, మరికొన్నింటిలో అజాన్‌తో కలిసి కెమెరాకు చిరునవ్వులు చిందిస్తూ పోజులిచ్చింది. వీరి మెహందీ వేడుకకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలలో వధువు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి అజాన్ భుజంపై తల ఆనించి కనిపించింది. ఈ ఫోటోలు అభిమానులను ఆకట్టుకోగా, అందమైన జంట అంటూ పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
Also Read
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
- National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
- Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
అయితే అందరూ ఒకే విధంగా స్పందించలేదు. అజాన్ వయసు కేవలం 17 సంవత్సరాలే కావడంతో, ఇంత చిన్న వయసులో వివాహం జరగడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో కొందరు ఫాలోవర్స్ అతని తల్లిదండ్రుల నిర్ణయాన్ని ప్రశ్నించారు. ఇంత చిన్న వయసులో పెళ్లి చేసుకోవడం అభిమానులకు తప్పుడు సందేశాన్ని ఇవ్వొచ్చని, అటు ప్రశంసలతో పాటు ఇటు విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
ఇక రియల్ అజాన్ పాకిస్తాన్లో యువతలో మంచి గుర్తింపు సంపాదించిన కంటెంట్ క్రియేటర్. ఆకట్టుకునే మీమ్స్, ఫన్నీ షార్ట్ వీడియోలు, వ్లాగ్‌లతో సోషల్ మీడియాలో ప్రత్యేక స్థానం సంపాదించాడు. ప్రస్తుతం అతని ఇన్స్టాగ్రామ్ ఖాతాను సుమారు 71.9 వేల మంది ఫాలో అవుతున్నారు. అయితే ఈ వివాహానికి సంబంధించిన మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, అజాన్ ఇప్పటివరకు తన భార్య పేరు ఇతర వివరాలను వెల్లడించలేదు. అందువల్ల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోల మధ్య కొత్త జంట గురించి తెలుసుకోవాలనే ఆసక్తి మరింత పెరిగింది.
తాజావార్తలు
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
-
Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
-
AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
ట్రెండింగ్
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!