Mallikarjun Kharge Visit Hyderabad: నేడు హైదరాబాద్ కు మల్లికార్జున ఖర్గే.. గాంధీభవన్ లో సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mallikarjun Kharge Visit Hyderabad: నేడు ఏఐసీసీ అద్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే హైదరాబాద్‌కు రానున్నారు. ఈనేపథ్యంలో.. ఎన్నికల ప్రచారం కోసం వస్తున్న ఆయన మధ్యాహ్నం గాంధీభవన్‌లో టీపీసీసీ ప్రతినిధులతో సమావేశం కానున్నారు… ఈ సందర్భంగా.. తెలంగాణకు చెందిన నాయకులందరూ దాదాపుగా మల్లికార్జున ఖర్గేకే మద్దతుగా నిలుస్తుండడంతో ఈ సమావేశానికి పార్టీకి చెందిన కొందరు ముఖ్య నేతలు హాజరవుతారని గాంధీభవన్ వర్గాలు చెపుతున్నాయి. కాగా.. ఈ.. ఎన్నికలు పారదర్శకంగా జరిగేందుకు గాను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు కీలక నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం లేదని సమాచారం. మల్లికార్జున ఖర్గేతో పాటు శశిథరూర్ కూడా పోటీలో ఉండటంతో ఇద్దరిలో ఎవరికి ఓటేయాలన్నది పూర్తిగా టీపీసీసీ ప్రతినిధుల అభీష్టమని.. ఈ సమావేశానికి తాము హాజరయితే ఆ ప్రభావం అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసే వారిపై ఉంటుందనే ఆలోచనతోనే ముఖ్య నేతలు ఈ సమావేశానికి దూరంగా ఉండాలని భావిస్తున్నట్టు సమాచారం.
Read also: Manchu Lakshmi: వైవిధ్యమే లక్ష్మి మంచు ఆయుధం!
Also Read
అయితే.. ఒకవేళ ఖర్గేను వ్యక్తిగతంగా కలసి మద్దతు ప్రకటించాలని భావిస్తే మాత్రం వారు కూడా సమావేశానికి హాజరయ్యే అవకాశం లేకపోలేదని సమాచారం.. కాగా, ఈ సమావేశాన్ని విజయవంతం చేసే బాధ్యతను మాజీ ఎంపీ మల్లురవి తీసుకున్నారు… ఆ పార్టీ నియమావళి ప్రకారం ఇప్పటికే టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఆయన.. వ్యక్తిగతంగా టీపీసీసీ ప్రతినిధులకు ఫోన్లు చేసి శనివారం జరిగే సమావేశానికి గాంధీభవన్‌కు రావాల్సిందిగా ఆహ్వానించారు. భారత రాజకీయాల్లో, ప్రజా జీవితంలో అపార అనుభవం ఉన్న మల్లికార్జున ఖర్గేను ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో గెలిపించాలని మాజీ ఎంపీ మల్లురవి శుక్రవారం ఒక ప్రకటనలో కాంగ్రెస్ నాయకులను కోరారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఖర్గేకు అన్ని అర్హతలు ఉన్నాయని అన్నారు.
What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
తాజావార్తలు
-
Daayra: కరీనా కపూర్ ‘దాయరా’ దిశా కేసు ఆధారంగా తెరకెక్కిందా?
-
Ishan Kishan: ఇషాన్ కిషన్ సరికొత్త రికార్డు.. కోహ్లీ, అభిషేక్‌లను వెనక్కి నెట్టి.. భారత తరఫున రెండో బ్యాటర్‌గా!
-
Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
-
Rajpal Yadav: కోర్టులోనూ నటిస్తున్నారా?.. రాజ్‌పాల్ యాదవ్‌పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు, రూ.2 కోట్లు కట్టాల్సిందే!
-
IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!