Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Mallareddy Participates In Muggulu Competition Medchal

MLA Malla Reddy : సంక్రాంతి సంబరాల్లో ముగ్గు వేసిన మల్లారెడ్డి..

Published Date :January 10, 2026 , 4:08 pm
By Gogikar Sai Krishna
  • మేడ్చల్‌లో ముగ్గుల పోటీల్లో మల్లారెడ్డి హాజరు
  • మహిళలను ఉత్సాహపరిచిన ఎమ్మెల్యే మల్లారెడ్డి
  • స్వయంగా ముగ్గు వేసి అందరిని ఆశ్చర్యపరిచిన మల్లారెడ్డి
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు & వీడియోలు
MLA Malla Reddy : సంక్రాంతి సంబరాల్లో ముగ్గు వేసిన మల్లారెడ్డి..
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు.. పల్లెల్లో, పట్టణాల్లో ముగ్గుల పోటీలతో సందడి నెలకొంటుంది. ఈ నేపథ్యంలో మేడ్చల్ నియోజకవర్గంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పూడూరు – కిష్టాపూర్ డివిజన్ పరిధిలోని కె.ఎల్.ఆర్ (KLR) ప్రాంతంలో బీఆర్ఎస్ నాయకుడు ఆకిటి నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళల కోసం భారీగా ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్లారెడ్డి, పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చారు.

Komatireddy Venkat Reddy: సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం మానేశా.. పెరిగిన ధరలకు నాకు సంబంధం లేదు..!

Also Read

  • Murder Case: జైలు నుంచే స్కెచ్.. రిటైర్డ్ ఐపిఎస్ హత్య కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు.!
  • Road Accident: కారు - బైక్ ఢీ.. ఐదుగురు మృతి.!
  • Narendra Modi : ఏడాది పాటు బంగారం కొనద్దు.. ప్రధాని మోడీ పిలుపు.!
  • PM Modi: కాంగ్రెస్‌కు కొత్త పేరు పెట్టిన మోడీ.. ‘MMC’ అంటే ముస్లిం లీగ్, మావోవాది కాంగ్రెస్!
Add as a preferred
source on google

సాధారణంగా ఏ కార్యక్రమానికి వెళ్లినా తనదైన పంచ్‌ డైలాగులతో, సందడితో అందరినీ నవ్వించే మల్లారెడ్డి.. ఈ ముగ్గుల పోటీల్లో కేవలం అతిథిగానే పరిమితం కాలేదు. పోటీలో పాల్గొన్న మహిళా మణులను ఉత్సాహపరుస్తూ, స్వయంగా తనూ రంగంలోకి దిగారు. ముగ్గు పిండి పట్టుకుని స్వయంగా నేలపై ముగ్గు వేసి అక్కడి వారిని ఆశ్చర్యపరిచారు. ఎమ్మెల్యే ముగ్గు వేయడం చూసి అక్కడి మహిళలు, నాయకులు పెద్ద ఎత్తున కేరింతలు కొట్టారు. నియోజకవర్గ ప్రజలతో మమేకమవ్వడంలో మల్లారెడ్డి ఎప్పుడూ ముందుంటారని ఈ సంఘటన మరోసారి నిరూపించింది.

ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. సంక్రాంతి మన సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీక అని, ముఖ్యంగా మహిళల సృజనాత్మకతకు ముగ్గుల పోటీలు చక్కని వేదికలని కొనియాడారు. లోగిళ్లన్నీ రంగురంగుల ముగ్గులతో కళకళలాడుతుంటే పండుగ కళ ఉట్టిపడుతుందని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. నిర్వాహకులు ఆకిటి నవీన్ రెడ్డిని అభినందిస్తూ, ఇలాంటి కార్యక్రమాలు మన మూలాలను గుర్తుచేస్తాయని అన్నారు. ముగ్గుల పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేసి, వారితో కలిసి ఫోటోలు దిగి సందడి చేశారు. ప్రస్తుతం మల్లారెడ్డి ముగ్గు వేస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

The Raja Saab: ప్రభాస్ బాక్సాఫీస్ ప్రభంజనం: ‘ది రాజా సాబ్’ సరికొత్త రికార్డు!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • mallareddy
  • medchal
  • Muggulu Competition
  • Sankranthi
  • telangana

తాజావార్తలు

  • Internet Crisis: ఇంటర్నెట్‌కు హోర్ముజ్ సెగలు.. భారత్‌కు ముప్పు తప్పదా?

  • Yogibabu : సత్య – యోగి బాబు నవ్వుల బాంబ్..’రంగబలి’ డైరెక్టర్ క్రేజీ ప్రాజెక్ట్ షురూ!

  • Petrol-Diesel Prices: పెట్రోల్-డీజిల్ ధరల పెంపునకు రంగం సిద్ధం.. ఈ సాయంత్రం షాకిచ్చే అవకాశం!

  • Nara Rohit: కొత్త సినిమా మొదలెట్టిన నారా రోహిత్

  • Trump China Visit: డ్రాగన్ గడ్డపై అడుగు పెట్టబోతున్న ట్రంప్ .. బీజింగ్ వేదికగా ఏం జరగబోతుంది?

ట్రెండింగ్‌

  • 204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..

  • Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..

  • 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!

  • PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..

  • Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions