సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు.. పల్లెల్లో, పట్టణాల్లో ముగ్గుల పోటీలతో సందడి నెలకొంటుంది. ఈ నేపథ్యంలో మేడ్చల్ నియోజకవర్గంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పూడూరు – కిష్టాపూర్ డివిజన్ పరిధిలోని కె.ఎల్.ఆర్ (KLR) ప్రాంతంలో బీఆర్ఎస్ నాయకుడు ఆకిటి నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళల కోసం భారీగా ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్లారెడ్డి, పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా…