Ball Tampering: ఆస్ట్రేలియా క్రికెట్లో మళ్లీ బాల్ ట్యాంపరింగ్ దుమారం.. నిషేధం తప్పదా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో మరోసారి బాల్ ట్యాంపరింగ్ వివాదం తీవ్ర చర్చనీయాంశమైంది. ఉస్మాన్ ఖ్వాజా తన పుస్తకంలో చేసిన సంచలన వ్యాఖ్యల దుమారం చల్లకముందే, ఆ దేశ మాజీ లెగ్ స్పిన్నర్ స్టూవర్ట్ మెక్‌గిల్ తాను కూడా గతంలో బాల్ ట్యాంరింగ్కు పాల్పడినట్లు బహిరంగంగా అంగీకరించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆస్ట్రేలియా తరఫున 44 టెస్టులు, 3 వన్డేలు ఆడిన మెక్‌గిల్.. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను మైదానంలో బాల్ ట్యాంపరింగ్ ఎలా చేసేవారనే విషయాన్ని స్వయంగా వెల్లడించారు.
తాను మ్యాచ్‌ల సమయంలో టీ విరామం తర్వాత బంతిని మార్చేసేవాడినని మెక్‌గిల్ తెలిపారు. తన బొటనవేలుకు చిన్న శాండ్ పేపర్ ముక్కను టేప్‌తో అంటించుకుని మైదానంలోకి దిగేవాడినని, అంపైర్లు బంతిని వదిలిపెట్టిన సమయంలో దానిని తీసుకుని బంతిని గరుకుగా మార్చేసేవాడినని వివరించారు. ఆ తర్వాత ఆ పర్ను తీసిపారేసేవాడినని, బంతిపై గీతలు పడటం మినహా ఎవరికీ ఎలాంటి అనుమానం వచ్చేది కాదని చెప్పారు. ఆ రోజుల్లో ప్రత్యర్థి జట్లు కూడా ఇవే పద్ధతులు పాటించేవని, అందుకే దీనిని తప్పుగా భావించలేదని ఆయన పేర్కొన్నారు.
Also Read
- YS Jagan: PPP పేరుతో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ భారీ స్కాం.. సీఎం చంద్రబాబుపై జగన్ ఫైర్..
- Kareena Kapoor: కరీనా లాకెట్‌పై ఖురాన్ వచనాలు.. కాంగ్రెస్ నేత లీగల్ నోటీసులు!
- CM Revanth Reddy: నీళ్ల నివాసాన్ని ఆక్రమిస్తే.. మన నివాసాలనే ఆక్రమిస్తాయి..
- AP Elections: ఎస్ఈసీ కీలక సమావేశం.. రేపే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్..
మరోవైపు, ఆస్ట్రేలియా బ్యాటర్ ఉస్మాన్ ఖ్వాజా తన పుస్తకంలో 2018 నాటి కేప్‌టౌన్ టెస్ట్ పేపర్ ఉదంతంపై సంచలన నిజాలు వెల్లడించారు. 2018లో దక్షిణాఫ్రికా టూర్లో జరిగిన బాల్ ట్యాంపరింగ్ విషయం జట్టులోని ప్రతి సభ్యుడికి ముందే తెలుసని ఆయన పేర్కొన్నారు. ఖ్వాజా చేసిన ఈ వ్యాఖ్యలకు తోడుగా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా స్పందిస్తూ ‘ఇప్పుడు అందరికీ నిజం తెలిసింది’ అని అనడం ఆస్ట్రేలియా క్రికెట్లో కలకలం రేపింది. 2018 నాటి ఆ ఘటనలో కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, బ్యాటర్ కామెరాన్ బెన్‌క్రాఫ్ట్‌లపై బోర్డు కఠిన నిషేధం విధించిన విషయం తెలిసిందే. తాజాగా మెక్‌గిల్ చేసిన ఈ తాజా ప్రకటనతో ఆస్ట్రేలియా క్రికెట్లో బాల్ ట్యాంపరింగ్ వివాదం మళ్లీ జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
తాజావార్తలు
-
Ball Tampering: ఆస్ట్రేలియా క్రికెట్లో మళ్లీ బాల్ ట్యాంపరింగ్ దుమారం.. నిషేధం తప్పదా..?
-
Ramayana Box Office: ‘రామాయణ’ సేఫ్ జోన్లోకి వెళ్లాలంటే ఇంకా ఎన్ని కోట్లు కావాలి?
-
YS Jagan: PPP పేరుతో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ భారీ స్కాం.. సీఎం చంద్రబాబుపై జగన్ ఫైర్..
-
Kareena Kapoor: కరీనా లాకెట్‌పై ఖురాన్ వచనాలు.. కాంగ్రెస్ నేత లీగల్ నోటీసులు!
-
CM Revanth Reddy: నీళ్ల నివాసాన్ని ఆక్రమిస్తే.. మన నివాసాలనే ఆక్రమిస్తాయి..
ట్రెండింగ్
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్‌గా సంజూ శాంసన్‌కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్‌కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!