Fire Accident: బోయిగూడ అగ్నిప్రమాదం.. వెలుగులోకి కీలక విషయాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
11 మంది కార్మికులు సజీవదహనం అయిన బోయిగూడ అగ్నిప్రమాదంపై పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి.. ప్రమాద ఘటనను త్రీడీ స్కనర్తో పరిశీలించాయి క్లూస్ టీమ్స్.. 11 మంది కార్మికులు సజీవ దహనం అయిన కేసులో దర్యాప్తు ముమ్మరం చేశాయి.. ఇప్పటికే పలు కీలక ఆధారాలు సేకరించారు ఫైర్ సేఫ్టీ అధికారులు మరియు క్లూస్ టీమ్స్.. షార్ట్ సర్క్యూట్‌తో ఎగిసిపడిన నిప్పు రవ్వల కారణంగా.. అగ్ని ప్రమాదం జరిగినట్టు అంచనా వేస్తున్నారు.. దీంతో స్క్రాప్ గోదాంలో మంటల అంటుకోవడం ద్వారా కరెంట్ బోర్డులు, సిలిండర్ పేలుడు సంభవించాయని చెబతున్ఆరు.. ఇక, ఈ ప్రమాదంలో ఫ్యూజ్‌లే కొంపముంచ్చాయా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి.. ఒక్కో ఫ్యూజ్‌లో అదనంగా మందమైన మూడు నాలుగు వైర్లు ఉన్నట్లు గుర్తించారు.. కేబుల్ వయర్లు మరియు ప్లాస్టిక్ వయర్లపై నిప్పురవ్వలు పడడం, స్విచ్ బోర్డులు, గ్యాస్ సిలిండర్ పేలడంతో భారీ అగ్నిప్రమాదానికి దారితీసినట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
Read Also: Psycho Husband: వీడు మామూలోడు కాదు.. వికృత వేధింపులు..
Also Read
స్క్రాప్ గోదాంలో 10కిపైగా స్విచ్‌బోర్డులు ఉన్నట్టు గుర్తించారు.. గోదాంలో కరెంట్ ఎక్కువ వాడకంతో షార్ట్ సర్క్యూట్ కారణంగా గోదాంలోని గ్రౌండ్ ఫ్లోర్లో భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డట్టుగా చెబున్నారు.. ఇక, ఇనుప మెట్లు ఉడడంతో పైనున్న వారు కిందకు రాలేకపోయారని, దట్టమైన పొగవల్ల సృహకోల్పోయి మంటల్లో సజీవదహనం అయినట్టు నిర్దారణకు వస్తున్నారు.. మరోవైపు.. అగ్నిప్రమాదం, గ్యాస్ పేలుడు ధాటికి తునాతునకలయ్యాయి రేకులు .. సిలిండర్ రెగ్యులేటర్ పక్కనే ఉన్న మరో షేడ్ పై పడినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.. సిలిండర్ పిన్ సైతం సిలిండర్‌లోకి వెళ్లినట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. క్లూస్ టీమ్ ఇన్చార్జ్ డాక్టర్ వెంకన్న నేతృత్వంలో 12 మంది సభ్యులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు.. త్రీడీ స్కానర్‌తో అణువణువూ పరిశీలన ద్వారా సేకరించిన ఆధారాలు ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ కు తరలించారు.
తాజావార్తలు
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్‌లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
-
CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్‌కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!