Mahesh Kumar Goud: దీపాదాస్ మున్షీపై ఎన్వీఎస్ఎస్ వ్యాఖ్యలు.. మహేష్ కుమార్ గౌడ్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahesh Kumar Goud: బీజేపీ మాజీ ఎమ్మెల్యే NVSS ప్రభాకర్ పై ఎమ్మెల్సీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. తమ పార్టీ రాష్ట్ర వ్యవహాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీపై అబద్దపు వ్యాఖ్యలు చేశారని ప్రభాకర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీపా దాస్ మున్శి పైన బీజేపీ నాయకులు ప్రభాకర్ చేసిన ఆరోపణలు వారి దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అన్నారు. దీపాదాస్ మున్శి నిజాయితీ, నిబద్ధత గల నాయకురాలని తెలిపారు. ఆమె తెలంగాణ ఇంచార్జ్ గా ఉండడంతో బీజేపీ నాయకులకు నిద్ర పట్టడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో స్వీప్ చేయబోతుందన్నారు.
బీజేపీకి ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదని.. దాంతో పిచ్చిలేసినట్టు బీజేపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. పస లేని, పనికి రాని ఆరోపణలు చేస్తూ రాజకీయంగా పూట గడుపుకోవడానికి బీజేపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు బీజేపీ నాయకుల మాటలను ఎవరు నమ్మరని అన్నారు. బీజేపీ నాయకులు నిరాధార ఆరోపణలు చేస్తే ఊరుకొము.. జాగ్రత్త… అంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్రభాకర్ వెంటనే దీపాదాస్ మున్శికి క్షమాపణ చెప్పి తన ప్రకటనను వెనక్కు తీసుకోవాలని మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు.
Also Read
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
క్షమాపణ చెప్పకుంటే తీవ్ర పరిణామాలు – కాంగ్రెస్ నాయకులు..
దీపాదాస్ మున్షీపై ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు దివాళా తీయడానికి నిదర్శనమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ విమర్శించారు. తను దీపాస్ మున్షీని బెంగాలీ కాళీ మాతగా అభివర్ణించడం సరికాదని మండిపడ్డారు. అవినీతి, అక్రమాలు, అబద్ధాలతో బతికే పార్టీ బీజేపీ అని, ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచనలో ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ ఉన్నారని, ఎంపీ టికెట్ కోసమే ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.
మరోవైపు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ వ్యాఖ్యలపై టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ మండిపడ్డారు. దీపాదాస్ మున్షీపై చేసిన వ్యాఖ్యలకు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ” దీపదాస్ మున్షీ బెంగాల్ టైగర్. తూటాలు ఎదుర్కొన్న నాయకుడు. అడ్డగోలుగా నోరు పారేసుకుంటే సహించం అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపునకు సహకరించిన నాయకురాలు దీపా దాస్ మున్షీ. తెలంగాణలో అత్యధిక ఎంపీ సీట్లు కాంగ్రెస్ గెలుస్తుందన్న సర్వేలను చూసి బీజేపీ నేతలు భయపడుతున్నారని మధుయాష్కీ గౌడ్ ధ్వజమెత్తారు.
అయితే అయోధ్య రామమందిర అంశాన్ని రాజకీయం చేయడం తగదని, రామమందిర సందర్శనకు ప్రత్యేక దినం లేదని పార్టీ రాష్ట్ర వ్యవహాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయోధ్య రామ మందిరంలో ఇప్పటికే కాంగ్రెస్ నేతలు పూజలు చేశారని, కాంగ్రెస్ పార్టీ అన్ని మతాల విశ్వాసాలను గౌరవిస్తుందని ఆమె అన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధిస్తామని దీపా దాస్ మున్షీ ఆశాభావం వ్యక్తం చేశారు.
Mohammed Shami: ఆ ఇద్దరు తెలుగు హీరోలు చాలా ఇష్టం: షమీ
తాజావార్తలు
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!