Madhu Yaskhi Goud Counter To Rajagopal Reddy: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సచ్చిపోయిందని రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో ఏమాత్రం వాస్తవం లేదని కాంగ్రెస్ నేత మధుయాష్కీ అన్నారు. రాజగోపాల్ రెడ్డికి మాట్లాడే అవకాశం వచ్చిందంటే.. అది కాంగ్రెస్ వల్లేనని కౌంటర్ వేశారు. కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉందన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ కలిసి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని.. రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఐదు నిమిషాల్లో ఆమోదం అవ్వడమే అందుకు నిదర్శనమని అన్నారు. ఈసారి టికెట్ ఎవరికి ఇచ్చినా, అందరం కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. సర్వే ఆధారంగానే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని తెలిపారు.
కాగా.. రీసెంట్‌గా రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే! స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా లేఖను స్పీకర్‌కు అందించగా.. వెంటనే ఆమోదించారు. బీజేపీలో చేరేందుకు సమాయత్తమవుతున్నారు. ఆల్రెడీ యాత్రలో ఉన్న బండి సంజయ్‌ను కలిశారు. ఈనెల 21వ తేదీన ఘనంగా నిర్వహించనున్న బీజేపీ బహిరంగ సభలో.. కమల తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలుస్తోంది. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మునుగోడ ఉప ఎన్నికల్లో రాజగోపాల్ నిలవనున్నారు. అయితే.. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు ఇంకా తమ అభ్యర్థుల్ని ఖరారు చేయాల్సి ఉంది.