Hyderabad: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ కొనసాగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో 525 మంది పోటీ చేస్తున్నారు. హైదరాబాద్‌లో తొలి రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉంది. హైదరాబాద్‌లో 4,903 ఓట్ల ఆధిక్యంలో మాధవీలత ఉన్నారు. చేవెళ్లలో తొలి రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి ఆధిక్యం, చేవెళ్లలో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. ఇక రంగల్‌లో తొలి రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యం, వరంగల్‌లో 8,404 ఓట్ల ఆధిక్యంలో కడియం కావ్య ఉన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని సికింద్రాబాద్ అసెంబ్లీలో మూడవ రౌండ్ ముగిసే సరికి 2000 ఓట్ల ఆధిక్యంతో బీజేపీ దూసుకుపోతుంది. నల్గొండ పార్లమెంటు మొదటి రౌండ్ ఫలితాలు.. కాంగ్రెస్-26,188 ఆధిక్యం, కాంగ్రెస్-37,984, బీఆర్ఎస్-11,796, బీజేపీ-10,970