తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్దిచెందిన బోనాల ఉత్సవాలు హైదరాబాద్ మహానగరం సంస్కృతీ, సాంప్రదాయలకు పెట్టింది పేరు. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన బోనాల ఉత్సవాలు జనాల్లో ఆద్యంత భక్తి పారవశ్యాన్ని కలుగజేస్తాయి అందరికీ సుఖశాంతులు.. ఆయురారోగ్యాలు, అష్టైష్వర్యాలు కలిగిస్తాయనేది భక్తులు ప్రగాఢ విశ్వసం. అయితే.. ముఖ్యంగా అంటువ్యాధులు ప్రజలకుండా ఉండడానికై తమకు అమ్మవార్లు రక్షణ కలిగించడంతో పాటు అండంగా ఉంటార నేది అనాదిగా వస్తున్న ఆచారం. కొన్ని వందల ఏళ్ళుగా జరుగుతున్న బోనాల ఉత్సవాలు తెలంగాణ ప్రజలు అత్యంత భక్తి శ్రధ్ధలతో జరుపుకుంటున్న విశిష్ఠ పండుగ.
అంతేకాకుండా తాము అమ్మవారికి సమర్పించే బోనాల వలన ఆ తల్లి చల్లని దీవెన మాకు ఎళ్ళవేళలా లభిస్తుందన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆ నమ్మకమే సమస్త మానవాళిని ముందుకు నడిపిస్తూ.. భగవంతుడిపై వున్న నమ్మకం క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని అందజేస్తుంది. అందుకే బోనాల పండుగ అడుగడుగునా మనందరికీ భక్తితో కూడిన ఉత్సవాలను తలపిస్తూ ఉంటాయి. ఈనేపథ్యంలోనే.. బోనాల ఉత్సవాలు మహానగరంలో 300 సంవత్స రాల క్రితం నుంచే కొనసాగుతున్నట్లు మన చరిత్ర పేజీలు చెబుతున్నాయి. బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం 300 సంవత్సరాల క్రితమే ఏర్పడినట్లు సమాచారం. గోల్కొండ కోట నిర్మితం కాకమునుపే ఎల్లమ్మ బోనాలు ప్రసిద్దిగాంచాయి. అదేవిధంగా అబుల్ హసన్ తానీషా కాలంలో జగదాంబికా మహంకాళి ఆలయ నిర్మాణం జరిగింది. అయితే.. ప్రతి ఏటా ఆషాడ మాసంలో బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి. కాగా.. మొట్టమొదట గోల్కోండ కోట బోనాలతో ప్రారంభమయ్యే బోనాలు పాతనగరం బోనాలతో ముగుస్తాయి.
కాగా.. నేడు లాల్ దర్వాజ బోనాలతో నగరంలో సర్వాంగ సుందరంగా ప్రారంభమైంది. పట్నం మంతా పల్లె వాతావరణాన్ని తలపించే విధంగా ఆలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. అంగరంగ వైభవంగా బోనాలు ఉత్సవాలు జరిపేందుకు ఆలయ అధికారులు, మంత్రులు చర్యలు చేపట్టారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు పూర్తీ చేసారు. భక్తులు బోనం మెత్తి అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకోనున్నారు.