Ujjaini Bonalu: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి పూజ అనంతరం తెల్లవారుజామున 3.30 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు, బోనం సమర్పించారు.
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్దిచెందిన బోనాల ఉత్సవాలు హైదరాబాద్ మహానగరం సంస్కృతీ, సాంప్రదాయలకు పెట్టింది పేరు. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన బోనాల ఉత్సవాలు జనాల్లో ఆద్యంత భక్తి పారవశ్యాన్ని కలుగజేస్తాయి అందరికీ సుఖశాంతులు.. ఆయురారోగ్యాలు, అష్టైష్వర్యాలు కలిగిస్తాయనేది భక్తులు ప్రగాఢ విశ