Site icon NTV Telugu

Kunamneni: ఫోన్ ట్యాప్ జరిగితే కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది కదా?

Governor Kunamneni

Governor Kunamneni

Kunamneni: తెలంగాణ గవర్నర్‌ తమిళి సై తన ఫోన్‌ ట్యాపింగ్ చేస్తున్నారన్న ఆరోపణలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పందించారు. గవర్నర్ ఫోన్ ట్యాపింగ్ చేశారు అని చెప్పడం అంటే వివాదం తెచ్చుకునే ఆలోచనలో ఉందని మండిపడ్డారు. ఫోన్ ట్యాప్ జరిగితే కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది కదా? అని ప్రశ్నించారు. విచారణ చేసి చర్యలకు అదేశించాలని డిమాండ్‌ చేశారు. గవర్నర్ ఇలాంటి మాటలు మట్లాడటం సరికాదన్నారు. ఢిల్లీ ఆదేశాలకు అనుగుణంగా గవర్నర్ పని చేస్తోందని ఆరోపించారు. గవర్నర్ వ్యవస్థ రద్దు చేయాలని త్వరలోనే గవర్నర్ కార్యాలయం ముట్టడి చేస్తామన్నారు.

Read also: Ganja Biscuits: గంజాయి బిస్కెట్ల కలకలం.. జైలులో ఉన్న అన్నకు పంపి జైలుపాలైన తమ్ముడు..

నా ట్విట్టర్ అకౌంట్, ఫేస్ బుక్ కూడా అలాగే చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షా, మోడీ లు క్రిమినల్స్ వారిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని అన్నారు. మాపై కేసులు ఉన్నా.. అవి ధర్నాలు చేసినవే అని అన్నారు. క్రిమినల్స్ పాలిస్తున్న దేశం మనది అయిపోయిందని ఆరోపించారు. Mla ల కొనుగోలు విషయంపై సిట్ విచారణ మంచి పరిణామన్నారు. కాల్ లిస్ట్ తీసి అందరిపై విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. అమిత్ షా పేరు కూడా ఉంది, FIR బుక్ చేయాల్సిందే అని డిమాండ్‌ చేశారు. Cbi విచారణ కోరుతుంది బీజేపీ.. సీబీఐ బీజేపీ చేతిలోనే ఉందని మండిపడ్డారు.
Gangula Kamalakar: గంగుల నివాసంలో రెండోరోజు ఈడీ సోదాలు.. విచారణకు పూర్తిగా సహకరిస్తానన్న మంత్రి

Exit mobile version