NTV Telugu Site icon

Minister KTR: మోడీ భ్రమలో నుంచి ప్రజలు బయటికి రావాలి..

Ktr

Ktr

భద్రాద్రి కొత్తగూడెం బీజేపీ అధ్యక్షుడు చిన్ని మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక, మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఖమ్మం, కొత్తగూడం వాళ్లతో ఇదే ప్రాబ్లం.. బీజేపీ చేసింది ఏమీ లేదు.. అటెన్షన్ డ్రైవర్షన్ చేసి ఓట్లతో గట్టెక్కాలని చూస్తుంది.. సమాజాన్ని కులం, మతం పరంగా విభజించాలని చూస్తుంది.. మతం పేరుతో మంట పెట్టి ఆ మంటలలో చలికాపుకోవాలని బీజేపీ చూస్తుందన్నాడు.

Read Also: Mahadev App: జ్యూస్ అమ్మే వ్యక్తి 30 వేల కోట్ల వ్యాపారవేత్త ఎలా అయ్యాడు..? కథేంటి

9 ఏళ్లలో తెలంగాణకి.. దేశానికి ఎన్నో దగా చేసింది బీజేపీ అని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఏర్పడిన కొత్తలోని ఐదు మండలాలను ఆంధ్రకి అప్పగించింది మోడీ ప్రభుత్వం.. లోయర్ సీలేరుని కూడా ఏపీకి కలిపింది బీజేపీ.. ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయని పార్టీ బీజేపీ విమర్శించారు. బయ్యారం ఉక్కు కర్మాగారం ఊసే ఎత్తకుండా చేసింది.. చట్టంలో చెప్పిన మాటని తుంగలో తొక్కింది మోడీ సర్కారు.. మోడీ భ్రమలో నుంచి ప్రజలు కూడా ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు.

Read Also: Womens Reservation Bill: ఎన్నికల కోసమే బీజేపీ ఓటర్లను మోసం చేస్తోంది..

స్విస్ బ్యాంకులో నుంచి నల్లదానం తెచ్చి పేదలకు పంచుతానని మోడీ చెప్పాడు అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇచ్చిన మాట తప్పడు మోడీ.. 73 వేల కోట్లు రైతుల ఖాతాలో వేసిన ఘనత కేసీఆర్ ది.. కొత్త ఉద్యోగాలు దేవుడు ఎరుగు ఉన్న ఉద్యోగాలని ఊడగోడుతున్నాడు మోడీ.. కిషన్ రెడ్డి ఏమో తెలంగాణలో ఉద్యోగాలు కావాలని ధర్నాలు చేశాడు.. కిషన్ రెడ్డికి సిగ్గు లజ్జ చీము నెత్తురు ఉంటే మోడీ దగ్గర ధర్నా చెయ్ అని మండిపడ్డాడు. ఏమైంది ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నావు అని మోడీని నిలదీయ్.. 400 సిలిండర్ 1200 చేసిన మోడీకి డిపాజిట్ రాకుండా చేయాలి.. సెప్టెంబర్ 17 గాయాలు మానుతూ ఉంటే చిల్లర మల్లారా సినిమా తీస్తున్నారు అని కేటీఆర్ పేర్కోన్నారు.

Read Also: CM YS Jagan: మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లు.. సీఎం జగన్‌ స్పందన ఇదే..

మానిన గాయాలను మళ్లీ గెలకాలని చూస్తుంది బీజేపీ చూస్తుంది అని కేటీఆర్ చెప్పారు. రజాకర్ అని ఓ బిజెపి నేత సినిమా తీశాడు.. కాశ్మీర్ ఫైల్స్ ఓవైపు.. రాజకార్ సినిమా మరోవైపు.. చేతగాని వాళ్లే ఇలాంటి భావోద్వేగాలను పెంచి చిల్లర మల్లర రాజకీయం చేస్తారు.. కాంగ్రెస్ కి సిగ్గు లజ్జ ఏమైనా ఉందా?.. ఒక అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నారు.. 50 ఏళ్లు అవకాశం ఇస్తే ఏం చేశారు.. సిగ్గు లేకుండా వచ్చి ఒక ఛాన్స్ ఇవ్వండి అని ఎలా అడుగుతారు అంటూ కేటీఆర్ తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయనోడు ఇప్పుడు వచ్చి ఒక అవకాశం ఇవ్వండి అంటున్నారు.. నోటికి ఇష్టం వచ్చిన వాగ్దానాలు చేస్తున్నారు.

Read Also: Depression: డిప్రెషన్ తో చిన్న వయస్సులోనే ఆత్మహత్య చేసుకున్న తారలు వీరే..

కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 200 రూపాయలు కూడా పెన్షన్ ఇవ్వలేదు అని కేటీఆర్ అన్నారు. ఇప్పుడు 4000 ఇస్తా అంటున్నారు.. 200 పెన్షన్ ఇవ్వలేనోడు 4000 పెన్షన్ ఇస్తామంటే నమ్ముతామా.. కాంగ్రెస్ నేతలకు పదవి గ్యారంటీ లేదు ప్రజలకు 6 గ్యారంటీలు అంట.. అధికారంలోకి వచ్చేది లేదు పోయేది లేదు.. పొరపాటున కాంగ్రెస్ కి ఓటేస్తే కటిక చీకటి గ్యారంటీ అని ఆయన ఆరోపించారు. తాగునీటి కష్టాలు గ్యారంటీ.. ఎరువుల కోసం విత్తనాల కోసం పోలీస్ స్టేషన్ ముందు నిలబడడం గ్యారంటీ.. దళిత బంధు రైతుబంధు ఎత్తేయడం గ్యారంటీ.. ఏడాదికో ముఖ్యమంత్రి మారడం గ్యారంటీ అంటూ కేటీఆర్ అన్నాడు.

Read Also: Bihar: విగ్రహ నిమజ్జనంలో అపశృతి.. చెరువులో పడి ఇద్దరు బాలికలు మృతి

కాంగ్రెస్ కి ఓటు వేస్తే తెలంగాణ సంకనాకి పోవడం గ్యారెంటీ అని కేటీఆర్ తెలిపారు. డబ్బు సంచులతో కెమెరా ముందు దొరికినోడిని పీసిసి చేస్తే ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలే వస్తాయి.. కర్ణాటకలో ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు పక్కదారి పట్టించింది కాంగ్రెస్.. కర్ణాటకలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేక కరెంటు చార్జీలు పెంచింది కాంగ్రెస్.. విద్యుత్ కోతలు కర్ణాటకలో మొదలయ్యాయి.. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మా దగ్గర డబ్బులు లేవని చెప్తున్నాడు.. అనవసరంగా హామీలు ఇచ్చామని కాంగ్రెస్ నేతలే చెప్తున్నారు అని పేర్కోన్నారు. మొండి చేయి పేట్టుకొని ఆరు గ్యారెంటీలు అంటున్నారు.. అభివృద్ధి గురించి ఏదైనా హామీ ఇచ్చారా అని కేటీఆర్ చెప్పాడు.