Sonam Wangchuk: విద్యార్థులపై కేసులుండవు, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు పరిహారం.. కేంద్రం ఇచ్చిన హామీలు ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sonam Wangchuk: సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ గత 26 రోజులుగా చేపట్టిన నిరాహార దీక్షను కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రాతపూర్వక హామీలతో ఎట్టకేలకు విరమించారు. పరీక్షల నిర్వహణ వ్యవస్థలో జవాబుదారీతనం, నీట్-యుజి (NEET-UG) పేపర్ లీక్ అంశంపై పార్లమెంట్లో పూర్తిస్థాయి చర్చ జరుపుతామని ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఆయన తన నిరసనను ముగించారు. గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో జులై 24 అర్ధరాత్రి దాటిన తర్వాత కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సమక్షంలో వాంగ్‌చుక్ జ్యూస్ తాగి దీక్ష విరమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి కేవలం మౌఖిక హామీలు కాకుండా రాతపూర్వక ప్రతిజ్ఞ కోరడం వల్లే చర్చలు మరో రెండు రోజులు సాగాయని వెల్లడించారు.
కేంద్రం ఇచ్చిన రాతపూర్వక హామీలలో ప్రధానంగా జులై 20న జరిగిన ‘చాలో పార్లమెంట్’ మార్చ్‌తో పాటు శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులు, ఆందోళనకారులపై ఎలాంటి కేసులు నమోదు చేయబోమని స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఇటీవల చోటుచేసుకున్న నీట్ పేపర్ లీక్ వివాదం వల్ల మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు తగిన నష్టపరిహారం అందించే అంశాన్ని కూడా ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోందని వాంగ్‌చుక్ తెలిపారు. దాదాపు 65 మంది వివిధ పార్టీల పార్లమెంట్ సభ్యులు కూడా తనను దీక్ష విరమించాలని విజ్ఞప్తి చేస్తూ, పార్లమెంట్లో ఈ సమస్యలపై గళం విప్పుతామని ఆశ్వాసన ఇచ్చినట్లు చెప్పారు.
Also Read
- Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
- Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
- iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమణపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందిస్తూ, “సోనమ్ జీ వైద్యుల సలహాలను పాటిస్తూ, త్వరగా కోలుకోవాలని, పూర్తి ఆరోగ్యంతో సాధారణ జీవనానికి తిరిగొస్తారని భావిస్తున్నాను” అని ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఆకాంక్షించారు. మరోవైపు కాకరోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే, వాంగ్‌చుక్ చేసిన త్యాగాన్ని కొనియాడుతూ ఆయన దీక్ష విరమించడం పట్ల ఊరట వ్యక్తంచేశారు. అయితే, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసేవరకు, పరీక్షల వ్యవస్థలో పూర్తి సంస్కరణలు తెచ్చేవరకు, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం ఇచ్చేవరకు జంతర్ మంతర్ వద్ద తమ శాంతియుత నిరసన కొనసాగుతుందని CJP స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!