Site icon NTV Telugu

KTR : డ్రగ్స్ టెస్టుకు నేను సిద్ధం.. ప్రజాప్రతినిధులంతా ముందుకు రావాలి

Ktr

Ktr

KTR : రాష్ట్ర రాజకీయాల్లో డ్రగ్స్ అంశం మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. మొయినాబాద్ డ్రగ్స్ కేసు నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ చేసిన విమర్శలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీటుగా స్పందించారు. తనపై వస్తున్న అనుమానాలను పటాపంచలు చేసేందుకు ఎలాంటి పరీక్షలకైనా తాను సిద్ధమని కేటీఆర్ ప్రకటించారు. మొయినాబాద్ డ్రగ్స్ వ్యవహారంలో కేటీఆర్ బృందం సమాధానం చెప్పాలని, ఆయనకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించాలంటూ మహేశ్ గౌడ్ చేసిన సూచనను కేటీఆర్ స్వాగతించారు. “నేను ఏ క్షణమైనా, ఏ పరీక్షకైనా సిద్ధంగా ఉన్నానని గతంలోనే పలుమార్లు స్పష్టం చేశాను. ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్నాను” అని కేటీఆర్ పునరుద్ఘాటించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి డ్రగ్స్ వాడటం అత్యంత దురదృష్టకరమని ఆయన అభిప్రాయపడ్డారు.

Srikanth Odela: ‘ప్యారడైజ్’ సినిమాలో మోహన్ బాబు విశ్వరూపం ఆ రోజు తెలుస్తుంది: శ్రీకాంత్ ఓదేల

కేవలం తాను మాత్రమే కాకుండా, రాజకీయాల్లో ఉన్న ప్రజాప్రతినిధులందరూ డ్రగ్స్ పరీక్షలు చేయించుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. “మనం పరీక్షలు చేయించుకుని సమాజానికి ఆదర్శంగా ఉందాం. డ్రగ్స్ వాడకాన్ని, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలను బీఆర్‌ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. డ్రగ్స్ వినియోగించే వారు ఎంతటి వారైనా సరే.. వారిని కఠినంగా శిక్షించాల్సిందే” అని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయ కక్షతో తన పేరును డ్రగ్స్ కేసులోకి లాగాలని చూస్తే ఊరుకోబోనని కేటీఆర్ హెచ్చరించారు. ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేస్తే చట్టపరంగా నోటీసులు జారీ చేస్తానని స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా తాను డ్రగ్స్ వాడకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తానని, యువతను పాడు చేస్తున్న ఈ సంస్కృతిని నిర్మూలించడంలో రాజీ పడబోమని ఆయన పేర్కొన్నారు.

CBSE Exams Cancelled: యుద్ధం ఎఫెక్ట్.. ఆ సీబీఎస్ఈ పరీక్షలు రద్దు..

Exit mobile version