Mininter KTR: అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. శాసన సభలో మంత్రి కేటీఆర్ కేంద్రంపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. తెలంగాణ పల్లెలు ప్రగతిపథంలో నడుస్తున్నాయన్నారు. నాబార్డు, ఎఫ్‌సీఐ నివేదికలను కూడా నమ్మరా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ కోటి ఎకరాల మాగాణిలా మారిందని గుర్తు చేశారు. సద్విమర్శలు చేయండి కానీ రాష్ట్రాన్ని కించపరచకండి అంటూ మండిపడ్డారు. ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్, హర్యానాతో పోటీపడుతున్నామన్నారని అన్నారు.
Read also: MIM V/s BRS: అక్బరుద్దీన్ ఓవైసీ వర్సెస్ కేటీఆర్.. గొంతు చించుకున్నంత మాత్రాన..
గుజరాత్లో పరిశ్రలకు పవర్ హాలీడేలు ప్రకటిస్తున్నారు అన్నారు. మేము రైతురాజ్యం కావాలంటే.. బీజేపీవాళ్లు కార్పోరేట్ రాజ్యం కావాలని అంటున్నారని మండిపడ్డారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అని దేశం మొత్తం ప్రచారం చేస్తాం అన్నారు. విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో నెంబర్ వన్ గా ఉన్నామన్నారు మంత్రి. ఇటువైపు ఉన్నప్పుడు బాగున్న ఈటల అటు వెళ్లాక పూర్తిగా మారిపోయారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంత దుర్మార్గమైన ప్రధాని ప్రపంచంలో ఎక్కడా లేరంటూ మండిపడ్డారు. దేశప్రజల చూపు కేసీఆర్ వైపు ఉందన్నారు. కేసీఆర్ అంటే మెచ్చని నేత లేరు ఆర్థికవేత్త లేరు అన్నారు మంత్రి. రోజుకు మూడు డ్రస్ లు మార్చడం కాదు.. ఓ విజన్ ప్రకారం నాయకులు పనిచేయాలన్నారు.
Read also: Vemula Prashanth Reddy: అక్బరుద్దీన్ మీ సహనం తగ్గిపోతుంది
అయితే అక్బరుద్దీన్ ఓవైసీ పై మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. ఏడుగురు సభ్యులు ఉన్న పార్టీకి ఎక్కువ సమయం సబబు కాదని అన్నారు. గొంతు చించుకున్నంత మాత్రాన ఉపయోగం ఉండదని మండిపడ్డారు. సభా నాయకుడు బీఏసీ కి రాలేదని నిందా పూర్వకంగా మాట్లాడడం తగదని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వం తరపున నలుగురు మంత్రులు బీ.ఏ.సీ కి వెళ్ళారు, అక్బర్ రాకుండా నిందించడం భావ్యం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు అందుబాటులో లేరని అనడం భావ్యం కాదని అన్నారు. అసెంబ్లీ తక్కువ రోజులు అంటున్నారు. కానీ, రెండేళ్ల కొవిడ్ ను మరచిపోయారు అంటూ సెటైర్ వేశారు మంత్రి కేటీఆర్ దీంతో కాసేపు శాసనసభలో అక్బరుద్దీన్ ఓవైసీ వర్సెస్ కేటీఆర్ గా కొనసాగింది.