KTR : నీళ్లు అడిగితే నెత్తురు చల్లుతావా.. రక్త పిశాచీ.?
- కాంగ్రెస్‌పై కేటీఆర్ తీవ్ర విమర్శలు
- తెలంగాణ ఉద్యమ చరిత్రను గుర్తుచేసిన బీఆర్ఎస్ నేత
- రైతుల కోసం రక్తమైనా ఇస్తామన్న కేటీఆర్
- ఎక్స్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR : రాష్ట్రంలో ఎండిపోతున్న పంట పొలాలకు సాగునీరు అందించాలంటూ డిమాండ్ చేసిన ప్రతిపక్షాల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా అత్యంత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “నీళ్లు అడిగితే నెత్తురు చల్లుతా అంటవా.. రక్త పిశాచీ! ఇంకా తీరలేదా మీ రక్తదాహం?” అంటూ కాంగ్రెస్ పాలనను ఆయన కడిగిపారేశారు. గత 60 ఏళ్లుగా తెలంగాణను పీడించి, ఇక్కడి బిడ్డల రక్తాన్ని తాగిన కాంగ్రెస్ తోడేలుకు ఇంకా ఎంత రక్తం కావాలని నిలదీశారు. తెలంగాణ పిల్లలను పిట్టల్ని కాల్చినట్టు కాల్చిపారేసి, ఎన్కౌంటర్ల పేరుతో నెత్తుటేళ్లు పారించిన నరహంతక చరిత్ర కాంగ్రెస్‌దని మండిపడ్డారు. 1952లో ఏడుగురు యువకులను, 1969లో 369 మంది ముద్దుబిడ్డలను తూటాలతో బలితీసుకున్న ఖూనీకోర్లు మీరేనని, మలిదశ పోరాటంలోనూ వేయిమంది బలిదానాలకు కాంగ్రెస్ మృగాలే కారణమని, ఆ పార్టీ చేతులు తెలంగాణ బిడ్డల రక్తంతో తడిసిపోయాయని కేటీఆర్ ధ్వజమెత్తారు.
Also Read
కాంగ్రెస్ రక్కసి కోరలకు అంటిన తెలంగాణ నెత్తుటి మరకలు ఎప్పటికీ చెరిగిపోవని, రైతుల కోసం తాము ఎంత రక్తమైనా ధారపోయడానికి సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. పేగులు తెగేదాకా రాష్ట్రం కోసం కొట్లాడి, నీళ్లలో నిప్పులు పుట్టించి జలసాధన పోరాటాలు చేసిన చరిత్ర తమదని గుర్తుచేశారు. “నెత్తురు ఇస్తేనే.. నీళ్లు ఇస్తాం అని కర్కశ కాంగ్రెస్ ప్రభుత్వం కోరుతుంటే మా నెత్తురు ధారపోస్తాం.. మీ రక్తదాహం తీర్చుకోని, ఎండిపోతున్న పొలాల జలదాహం తీర్చండి” అంటూ రైతుల పక్షాన నిలబడి ఎంతటి త్యాగానికైనా తాము వెనకాడబోమని కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు.
- Tags
- BRS
- congress
- ktr
- revanth reddy
- telangana
తాజావార్తలు
-
KTR : నీళ్లు అడిగితే నెత్తురు చల్లుతావా.. రక్త పిశాచీ.?
-
US-Iran War: ప్రభుత్వం vs మిలిటరీ.. హార్ముజ్ అంశంపై ఇరాన్లో అంతర్గత విభేదాలు..
-
Nithiin: టాలీవుడ్లో సరికొత్త కాంబినేషన్.. నితిన్, రుక్మిణి వసంత్‌ను కలుపుతున్న నాని!
-
Earthquake: బంగాళాఖాతంలో 4.5 తీవ్రతతో భూకంపం.. ఆంధ్రలో ప్రకంపనలు..
-
Harish Rao : సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..