KTR : రేవంత్ ఒక నిజాయితీ గల మోసగాడు.. ప్రశ్నిస్తున్నామని ఆయనకు కోపం
- రేవంత్‌పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
- సిరిసిల్ల పర్యటనపై తీవ్ర విమర్శలు
- ఫోన్ టాపింగ్, ఫార్ములా ఈపై ప్రశ్నలు
- ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా రైతుల కన్నీళ్లు, గోస మాత్రమే కనిపిస్తున్నాయని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఫల్యాలు, కక్షసాధింపు చర్యలపై నిప్పులు చెరిగారు. “మోసపోకండి.. మోసపోతే గోస పడతాం” అని కేసీఆర్ ఆనాడే చెప్పిన మాటలు ఈరోజు అక్షరసత్యాలవుతున్నాయని, పాత రాజ్యాన్ని తిరిగితెస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి అదే రకంగా రాష్ట్రాన్ని మళ్లీ కష్టాల్లోకి నెట్టేశారని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఒక నిజాయితీ గల మోసగాడని, ఆయన మాట్లాడే దివానా మాటలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
సిరిసిల్ల పర్యటనపై ధ్వజం.. చేనేత కార్మికులకు దక్కని న్యాయం
సిరిసిల్లలో ముఖ్యమంత్రి పర్యటించిన తీరుపై కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు 35 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుని మరణిస్తే, సీఎం వారి కుటుంబాలను పరామర్శిస్తారని, ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారం ప్రకటిస్తారని ఆశించామని అన్నారు. కానీ, శత్రు దేశంపై దండయాత్రకు వెళ్లినట్లు 4,000 మంది పోలీసులను వెంటబెట్టుకుని వెళ్లారని ఎద్దేవా చేశారు. దారిలో జనాలు ఎవరూ లేకపోయినా ఖాళీ రోడ్లకు చేతులు ఊపుకుంటూ వెళ్లడం రేవంత్ రెడ్డికే చెల్లిందని విమర్శించారు. నేడు రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా యూరియా దొరకక రైతులు అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read
- IMD October 2026 Forecast: తెలంగాణకు IMD బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లోనూ వర్షాలు లేనట్టే..!
- Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
- Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
నా బిల్డింగులు, ఫోన్ టాపింగ్ ఆరోపణలు ఏమయ్యాయి?
గతంలో రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను కేటీఆర్ ఈ సందర్భంగా లేవనెత్తారు. హైదరాబాద్‌లోని భవనాలన్నీ కేటీఆర్‌వేనని, ఫార్ములా-ఈ రేసింగ్‌లో అక్రమాలు జరిగాయని, సినీ నటుల ఫోన్లు టాప్ చేశామని గతంలో నోటికొచ్చినట్లు మాట్లాడారని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులవుతున్నా ఆ ఆరోపణలపై ఏమైనా తేల్చారా అని నిలదీశారు. ప్రభుత్వం వద్ద అన్ని అధికారాలు ఉండి కూడా ఏ ఒక్క ఆరోపణను నిరూపించలేకపోయారని, ప్రభుత్వం బ్రహ్మాండంగా దోచుకోవడంలో మునిగిపోయిందని, తాము ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తున్నందుకే సీఎంకు తమపై కోపం వస్తోందని అన్నారు.
నేను ఆల్తూఫాల్తూగాన్ని కాదు.. కేసీఆర్ వారసత్వంపై స్పష్టత
ముఖ్యమంత్రి చేస్తున్న వ్యక్తిగత విమర్శలకు కేటీఆర్ గట్టిగా సమాధానమిచ్చారు. 9వ తరగతి ఫెయిల్ అయిన రేవంత్ రెడ్డి తమ్ముడు ఏరోస్పేస్ కంపెనీ పెట్టడం వెనుక ఉన్న మర్మమేమిటని ప్రశ్నించారు. అమెరికాలో అందరూ తమ పని తామే చేసుకుంటారని, అంతమాత్రాన దాన్ని అవహేళన చేయడం సరికాదని హితవు పలికారు. కేసీఆర్ తమను బాగా చదువుకోమని చెప్పారని, తాము అమెరికా వెళ్లి ఉన్నత చదువులు చదువుకున్నామని, తానేమీ ఆల్తూఫాల్తూగాన్ని కాదని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ ఆశీస్సులతో 1983లో రాజకీయాలోకి వచ్చిన కేసీఆర్, 1985లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి తదనంతరం మంత్రిగా, డిప్యూటీ స్పీకర్‌గా, కేంద్ర మంత్రిగా సుదీర్ఘ రాజకీయ అనుభవం గడించారని గుర్తుచేశారు. విమర్శలు మాని ఇప్పటికైనా ప్రజాపాలనపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
KTR : రేవంత్ ఒక నిజాయితీ గల మోసగాడు.. ప్రశ్నిస్తున్నామని ఆయనకు కోపం
-
The Paradise: బ్రేక్ అనుకుని యాక్సిలరేటర్ తొక్కేశా.. ఆ క్యారెక్టర్ అని తెలిస్తే ఒప్పుకునేవాడినే కాదు: మోహన్ బాబు
-
Mohan Babu: డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నన్ను దారుణంగా మోసం చేశాడు.. నాని ముందే బాంబ్ పేల్చిన మోహన్ బాబు!
-
Flydubai Heroes: పైలట్, ప్లంబర్, డెంటిస్ట్, బిజినెస్ మ్యాన్, బ్యాంకర్.. ఫ్లైదుబాయ్ ఘటనలో హీరోలు వీరే..
-
Team India Record: టీ20ల్లో టీమిండియా నయా రికార్డు.. ప్రపంచంలోని మొదటి జట్టు..!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?