KTR : రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డి పదే పదే మేడిగడ్డ బరాజ్ కూలిందంటున్నారు.. దమ్ముంటే అదే మేడిగడ్డ మీద కూర్చుని చర్చపెడుదాం వస్తావా అంటూ సవాల్ విసిరారు మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్ లో బుధవారం జరిగిన దళిత బంధు సాధన సమితి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ మధ్య సీఎం రేవంత్ రెడ్డి తన తప్పులను కప్పి పుచ్చుకోవడానికి పదే పదే మేడిగడ్డ కూలిందంటున్నాడు. ఆయన ఆరోపణలకు మేం క్లారిటీ ఇస్తాం. రేవంత్ రెడ్డి కూలిందంటున్న మేడిగడ్డ బరాజ్ మీదకే చర్చకు రావాలి. దమ్మంటే రేవంత్ మేము విసిరిన సవాల్ స్వీకరించాలి. మమ్మల్ని చర్చకు రావాలంటూ పారిపోయిన పిరికి వ్యక్తి రేవంత్ రెడ్డి అన్నారు కేటీఆర్.
Read Also : Telangana : సీఎంల భేటీ.. తెలంగాణ 10 ప్రతిపాదనలు ఇవే..
నాగార్జునసాగర్ కట్టపైన చర్చకు వస్తావా అని రేవంత్ రెడ్డి సవాల్ విసురుతున్నారు. నాగార్జున సాగర్ మీద కాదు.. ముందు మేడిగడ్డ బ్యారేజ్ మీద చర్చకు రావాలి. ఇప్పటికే మా సీనియర్ నాయకులు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మేడిగడ్డ బరాజ్ వద్దకు వెళ్లి వచ్చి మరి సవాల్ విసిరిండు. తుంగతుర్తి సూర్యాపేట నియోజకవర్గం చివరి మడి వరకు నీరు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ అని రేవంత్ కు తెలుసు. అయినా కూడా రేవంత్ రెడ్డి అబద్దాలు మాట్లాతున్నాడు. ఆయన పదే పదే తన దగ్గర బడ్జెట్ లేదని తప్పించుకుంటున్నాడు. ఏమైనా అంటే నన్ను కోసుకుని తింటారా అంటున్నాడు. రానున్న స్థానిక సంస్థల్లో ప్రజలు సరైన బుద్ధి చెప్తారు అంటూ చెప్పారు కేటీఆర్.
Read Also : Ap- Telangana : మొదలైన తెలంగాణ, ఏపీ సీఎంల మీటింగ్..