KTR Tweet: దీపావళి పండుగ శుభ సందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ దీపాల పండుగ… మనందరి జీవితాలలో ప్రగతి కాంతులు నింపాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తూ… దీపావళిని అందరూ సురక్షితంగా, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు.
దీపావళి పండుగ శుభ సందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు!
ఈ దీపాల పండుగ… మనందరి జీవితాలలో ప్రగతి కాంతులు నింపాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తూ… దీపావళిని అందరూ సురక్షితంగా, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నాను.#HappyDeepavali pic.twitter.com/87iFUgUOhi
— KTR (@KTRTRS) October 24, 2022
అనంతరం టీఆర్ఎస్ సర్కారుకు యువత అండగా నిలబడాలని మంత్రి కేటీఆర్ ట్విట్ ఆశక్తి కరంగా మారింది. ప్రధాన రాజకీయ పార్టీలు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఉప ఎన్నికల్లో గెలిచి సత్తా చాటేందుకు అన్ని పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నాయని అన్నారు. మునుగోడు నియోజకవర్గ ప్రజలకు హామీల వర్షం కురిపిస్తున్నారని అన్నారు. ఈనేపథ్యంలో.. మునుగోడు నియోజకవర్గ ఓటర్లకు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చారు. లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఉప ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కోరారు. దాదాపు 35 వేల మంది స్థానిక యువతకు ఉపాధి కల్పించే గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో ఫుడ్ ప్రాసెసింగ్, టాయ్ పార్క్ రాబోతున్నట్లు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇక, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేస్తున్నామని వివరించారు.
Read also: Janasena : మహిళా కమిషన్ చైర్ పర్సన్‌పై జనసేన ట్విట్టస్త్రాల వర్షం..
మునుగోడు ఉప ఎన్నికల్లో 47 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని. నవంబర్ 3న ఉప ఎన్నిక నిర్వహించి, ఫలితాలు నవంబర్ 6న వెల్లడి కానున్నాయి. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి, బీఎస్పీ నుంచి ఆందోజు శంకరాచారి. పల్లె వినయ్ కుమార్ TJS నుండి ఉన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు మునుగోడు ఉప ఎన్నిక కీలకంగా మారింది. మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిస్తే వచ్చే ఎన్నికల్లోనూ ఆ ప్రభావం తప్పకుండా ఉంటుందని రాజకీయ పార్టీలన్నీ భావిస్తున్నాయి. ఈ క్రమంలో మునుగోడులో సీటు కైవసం చేసుకునేందుకు అన్ని పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే ప్రచారంలో వేగం పెంచారు. మునుగోడు యువతకు కేటీఆర్ ట్వీటర్ ద్వారా వీడియో పోస్ట్ ఆసక్తికరంగా మారింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో, తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య భాగస్వామ్యంలో స్థానిక యువతకు ఉపాధి అందించే సంకల్పంతో ఆసియాలోనే అతి పెద్ద పారిశ్రామికవాడ మునుగోడు నియోజకవర్గంలోని దండు మల్కాపూర్‌లో 2019లోనే నెలకొల్పింది టీఅర్ఎస్ ప్రభుత్వం.@TIF_TELANGANA@Koosukuntla_TRS
1/3 pic.twitter.com/lpRyHiLpeY— KTR (@KTRTRS) October 24, 2022