ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే.. పవన్ కల్యాణ్ వ్యాఖ్యల తరువాత వైసీపీ శ్రేణులు సైతం అంతే ఘాటుగా స్పందించారు. ఇదిలా ఉంటే.. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను తప్పుపడుగూ ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డ పద్మ పవన్ కల్యాణ్‌కు నోటీసులు పంపారు. అయితే.. దీనిపై జనసైనికులు ట్విట్టర్ వేదికగా.. వాసిరెడ్డి పద్మను టార్గెట్ చేస్తూ.. ట్విట్టస్త్రాలు సంధిస్తున్నారు. ఇదే సమయంలో తాజాగా జనసేన ఇంచార్జీ ఉషా కిరణ్ మీడియాతో మాట్లాడుతూ.. ఆడవాళ్ల పట్ల హేళనగా ప్రవర్తించే అంబటికి నోటీసులు ఇచ్చారా అని వాసిరెడ్డి పద్మను ప్రశ్నించారు.
Also Read : Kottu Satyanarayana : చంద్రబాబు డైరెక్షన్‌తో పవన్ విశాఖలో హంగామా సృష్టించారు
అశ్లీల వీడియోల్లో హల్‌చల్ చేసిన గోరంట్ల మాధవ్ కు నోటీసులు ఇచ్చారా?.. కాసినో నిర్వహణకు పూనుకున్న కొడాలి నాని కి నోటీసులు ఇచ్చారా? విడాకులు ఇచ్చిన వారికి నోటీసులు ఇవ్వడం ఏంటి.. రాష్ట్రంలో ఎవరు విడాకులు ఇచ్చినా వారందరికీ నోటీసులు ఇస్తారా అంటూ ఉషా కిరణ్ మండిపడ్డారు. స్వయాన సీఎం సోదరి షర్మిల కూడా విడాకులు తీసుకున్నారని… ఆమెకు కూడా నోటీసులు ఇస్తారా? అని నిలదీశారు ఉషా కిరణ్. ట్విట్టర్ వేదికగా సైతం.. #APWomenCommission ను ట్యాగ్ చేస్తూ జనసైనికులు ట్విట్టస్త్రాలు సంధిస్తున్నారు. దిగజారుడుతనమని ఉషా కిరణ్ (Janasena leader) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.