KTR-Akhilesh Yadav : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌లో కలిసి టిఫిన్ చేశారు. నగరంలోని రామేశ్వరం కేఫ్‌కు మధ్యాహ్నం చేరుకున్న ఇరువురు నేతలకు కేఫ్ యజమాని శరత్ ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రామేశ్వరం కేఫ్‌లో అందించే వివిధ రుచుల టిఫిన్‌లను ఆస్వాదించిన కేటీఆర్, అఖిలేశ్ యాదవ్, ఆహార పదార్థాల నాణ్యతను ప్రశంసించారు. టిఫిన్ సందర్భంగా రాజకీయాలు, సమకాలీన పరిణామాలపై పరస్పరంగా చర్చలు జరిపినట్లు సమాచారం. టిఫిన్ అనంతరం ఇరువురు నేతలు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసానికి వెళ్లారు.
Shehbaz Sharif Trolled: ప్రపంచం ముందు పాక్ ప్రధాని నవ్వుల పాలైన 6 సందర్భాలు ఇవే..