CP Kottakota Srinivas Reddy: సినీ పరిశ్రమ పెద్దలలో సమావేశం పెట్టీ డ్రగ్స్ నిర్మూలన పై మాట్లాడుతానని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇవాళ సీపీగా శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కి సందీప్ శాండిల్య బాధ్యతలు అప్పగించారు. అనంతరం హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..నా సామర్థ్యాన్ని గుర్తించి నాకు ఈ స్థానం కల్పించిన సీఎం రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ పోలీసింగ్ లో అనేక సవాళ్లు వున్నాయని అన్నారు. డ్రగ్స్ లాంటి సమాజానికి హాని చేసే వాటిని నిర్మూలించుకుంటూ ముందుకు వెళ్తానని తెలిపారు. కమీషనరేట్ లో వున్న పోలీస్ అధికారులంతా నాతో సహకరిస్తారని ఆశిస్తున్నానని అన్నారు. మెట్రోపాలిటన్ సిటీ లలో మూడు ఛాలెంజ్ లు వుంటాయన్నారు. క్విక్ రెస్పాన్స్ అనేది చాలా కీలకమన్నారు. ప్రజలకు త్వరగా సాయం చేయాలన్నది మా పోలీస్ కర్తవ్యమని తెలిపారు.
Read also: Revanth Reddy: ధరణి సమస్యలపై రేవంత్ రెడ్డి సమీక్ష.. కమిటీ వేసే ఆలోచనలో ప్రభుత్వం..!
ర్యాగింగ్ ను సహించేది లేదు.. షీ టీమ్స్ ను మరింత బలోపేతం చేస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు…సిటీ నీ డ్రగ్ రహిత సిటీ గా మారుస్తామన్నారు. సమాజంలో యువశక్తి నీ డ్రగ్స్ నిర్వీర్యం చేస్తుందని అన్నారు. సైబరాబాద్, రాచకొండ కమిషనర్ లతో కోఆర్డినేట్ చేసుకుంటూ.. డ్రగ్స్ ను నిర్మూలిస్తామని తెలిపారు. డ్రగ్ ముఠాలు హైదరాబాద్ తో పాటు ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళాలని హెచ్చరించారు. సినీ పరిశ్రమలో డ్రగ్స్ వాడుతున్నారని సమాచారం వుందని స్పష్టం చేశారు. పబ్స్ , బార్ అండ్ రెస్టారెంట్ ల వద్ద డ్రగ్స్ సరఫరా జరిగితే కటిన చర్యలు తప్పవన్నారు. సినీ పరిశ్రమ పెద్దలలో సమావేశం పెట్టి.. డ్రగ్స్ నిర్మూలన పై మాట్లాడుతానని అన్నారు. పబ్స్ అన్ని డ్రగ్స్ సరఫరా చేస్తున్నాయని కాదు నా ఉద్దేశమన్నారు. సినీ పరిశ్రమలో కూడా అందరూ డ్రగ్స్ వాడుతున్నారని కాదని క్లారిటీ ఇచ్చారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అవహేళనకు గురి అయిందన్నారు. చట్టాన్ని గౌరవించే వారితోనే ..ఫ్రెండ్లీ పోలీసింగ్ వుంటుందన్నారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కటినంగా వ్యవహరిస్తామని హెచ్చారించారు.
Monkeys Meat: నిర్మల్ లో కోతులను చంపితిన్న వ్యక్తులు.. భయాందోళనలో గ్రామస్తులు