గ్లోబల్ స్టార్, పాన్ ఇండియా హీరో ఎన్టీఆర్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమాలో నటిస్తున్నాడు.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకేక్కుతున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది.. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.. ‘NTR31′ పేరుతో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కావొస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ సినిమాకు సంబందించిన విషయాల గురించి చర్చించేందుకు చర్చించేందుకు తన సతీమణి లక్ష్మీ ప్రణతితో కలిసి బెంగళూరుకు వెళ్లారు ఎన్టీఆర్.. ఈ సందర్బంగా కేజీఎఫ్’ స్టార్స్, కాంతారా హీరో రిషబ్ శెట్టి లు ఎన్టీఆర్ ను కలిశారు.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
కాగా, ఈ సినిమా కోసం బాగా తగ్గినట్లు కనిపిస్తున్నారు.. న్యూ లుక్ ఫోటోలను ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.. ఎన్టీఆర్ ‘NTR31’సినిమా భిన్నమైన ఎమోషన్స్ తో కొనసాగుతుందని ఇప్పటికే ప్రశాంత్ నీల్ తెలిపారు. చాలా మంది అభిమానులు ఇదొక యాక్షన్ సినిమా అనుకుంటున్నారని, కానీ కొత్త స్టోరీతో ఈ మూవీ రూపొందుతున్నట్లు తెలిపారు… త్వరలోనే ఈ సినిమా గురించి అప్డేట్ రాబోతున్నట్లు సమాచారం..