Former OSD Sumanth : మాజీ OSD సుమంత్‌కు బిగ్ రిలీఫ్.. ముందస్తు బెయిల్.!
- సుమంత్‌తో పాటు మరో ముగ్గురికి ఊరట
- రూ.25 వేల పూచీకత్తుతో బెయిల్
- దర్యాప్తుకు సహకరించాలని కోర్టు ఆదేశం
- సాక్షులను బెదిరించొద్దంటూ షరతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Former OSD Sumanth : మాజీ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. సుమంత్‌తో పాటు మరో ముగ్గురికి కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ఇచ్చిన న్యాయస్థానం.. ఒక్కొక్కరు రూ.25 వేల చొప్పున రెండు వ్యక్తిగత పూచీకత్తు బాండ్లు సమర్పించాలని ఆదేశించింది. షూరిటీలను సమర్పించిన అనంతరం ముందస్తు బెయిల్‌పై విడుదల చేయాలని దర్యాప్తు అధికారిని ఆదేశించింది.
పోలీసుల ముందు సరెండర్ కావాలి
ముందస్తు బెయిల్ పొందిన నిందితులు పోలీసుల ముందు సరెండర్ కావాలని కోర్టు సూచించింది. కేసు దర్యాప్తుకు పూర్తిగా సహకరించాలని స్పష్టం చేసింది. దర్యాప్తు అధికారి అవసరమైనప్పుడు పిలిస్తే తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించింది. కేసు దర్యాప్తును ప్రభావితం చేసే ఎలాంటి చర్యలకు పాల్పడకూడదని కోర్టు స్పష్టం చేసింది. ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ సాక్షులను ప్రేరేపించడం, బెదిరించడం చేయకూడదని ఆదేశించింది. సాక్ష్యాలను ప్రభావితం చేసే ప్రయత్నాలు చేయకూడదని పేర్కొంది.
Also Read
దేశం విడిచి వెళ్లడంపై ఆంక్షలు
కోర్టు ముందస్తు అనుమతి లేకుండా భారతదేశాన్ని విడిచి వెళ్లకూడదని సుమంత్‌కు న్యాయస్థానం షరతు విధించింది. దర్యాప్తు పూర్తయ్యే వరకు కోర్టు ఆదేశాలను కచ్చితంగా పాటించాలని సూచించింది. ముందస్తు బెయిల్ పొందిన పిటిషనర్లు తమ మొబైల్ ఫోన్ నంబర్లు, నివాస చిరునామాలను దర్యాప్తు అధికారికి అందించాలని కోర్టు ఆదేశించింది. దర్యాప్తు ప్రక్రియలో పోలీసులు కోరినప్పుడు అందుబాటులో ఉండాలని స్పష్టం చేసింది.
మరో ముగ్గురికి కూడా బెయిల్
సుమంత్‌తో పాటు ఈ కేసులోని మరో ముగ్గురు పిటిషనర్లకు కూడా నాంపల్లి కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. వ్యక్తిగత పూచీకత్తులు, ష్యూరిటీలను సమర్పించిన తర్వాత బెయిల్‌పై విడుదల చేయాలని దర్యాప్తు అధికారిని ఆదేశించింది. దీంతో ఈ కేసులో నిందితులకు కోర్టు నుంచి తాత్కాలికంగా ఊరట లభించినట్లయింది.
తాజావార్తలు
-
Former OSD Sumanth : మాజీ OSD సుమంత్‌కు బిగ్ రిలీఫ్.. ముందస్తు బెయిల్.!
-
TG SAFE : కూకట్‌పల్లిలో ఫుడ్ సేఫ్టీ రైడ్స్.. 5 లైసెన్సులు సస్పెండ్..!
-
World EV Day 2026: Ather నుంచి Bajaj Chetak వరకు బెస్ట్ ఆప్షన్స్ ఇవే.. రేంజ్, ధర వివరాలు
-
Mamata Banerjee: బైపోల్ బరిలోకి మమతా బెనర్జీ!.. పోటీపై సర్వత్రా ఉత్కంఠ..!
-
CM Chandrababu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు.. రేపటి నుంచి రెండు రోజుల పాటు..
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!