Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
- కేటీఆర్ వ్యాఖ్యలపై కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం
- ఫామ్‌హౌస్‌లు, భూములపై సంచలన ఆరోపణలు
- డ్రగ్స్ దందాపైనా మంత్రి కీలక వ్యాఖ్యలు
- ఉపఎన్నికలకు భయపడేది లేదన్న కోమటిరెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komatireddy Venkat Reddy : మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వాకిటి శ్రీహరి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నియోజకవర్గ పరిధిలోని పలు ప్రధాన రహదారులు, వంతెనల నిర్మాణాలకు సంబంధించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రసంగిస్తూ, బిఆర్ఎస్ నాయకులు, ముఖ్యంగా కేటీఆర్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఫామ్‌హౌస్‌లు, డ్రగ్స్ దందాపై తీవ్ర ఆరోపణలు
కేటీఆర్ నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని మంత్రి కోమటిరెడ్డి హెచ్చరించారు. ప్రజల సొమ్మును దోచుకుని వందల ఎకరాల్లో ఫామ్‌హౌస్‌లు కడితే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. అసైన్డ్ భూములు, లావుణి పట్టా భూములతో పాటు 111 జీవో పరిధిలోని స్థలాల్లో డ్రగ్స్ దందా సాగిస్తుంటే ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. అక్రమంగా కొల్లగొట్టిన ప్రభుత్వ భూములను తిరిగి రికవరీ చేసి తీరాలని స్పష్టం చేశారు. గతంలో ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ తీసుకుంటూ కేటీఆర్ బావమరిది పట్టుబడిన ఉదంతాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
Also Read
- వరంగల్ MGMలో ఒక్కసారిగా కుప్పకూలిన సీలింగ్.. ముగ్గురికి గాయాలు!
- Harish Rao : రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రాక్షస రాజ్యం వచ్చింది
- Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో గణపయ్య సందడి.. క్యూలైన్లన్నీ ఫుల్.!
- Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
పశువుల్లా కొనుగోలు చేశారు.. ఉపఎన్నికలకు భయం లేదు!
తాను ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించినప్పటికీ తనకు ఎలాంటి ఫామ్‌హౌస్ లేదని మంత్రి తెలిపారు. గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు 13 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేశారని మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితిని అడ్డం పెట్టుకుని బిఆర్ఎస్ నాయకులు నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉపఎన్నికలు అంటే ఎలాంటి భయం లేదని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
-
SIR: వీవీఐపీలకు SIR షాక్.. జైశంకర్, ఆర్మీ చీఫ్, CBI డైరెక్టర్ పేర్లు..
-
Kayadu Lohar: కయాదు వెనుక ఇంత కన్నీటి కథ ఉందా? ‘ప్యారడైజ్’ బ్యూటీ జర్నీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!