Komatireddy Venkat Reddy: ఎన్నికల ప్రచారంలో పాల్గొంటా.. కానీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komatireddy Venkat Reddy Gives Green Signal To Participate In Munugodu Election Campaign: కొంతకాలం నుంచి ఎంపీ కోమటరెడ్డి వెంకట్ రెడ్డి ఎపిసోడ్‌పై నెలకొన్న సస్పెన్స్ ఎట్టకేలకు వీడింది. తాను కాంగ్రెస్ తరఫున మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని స్పష్టం చేశారు. తొలుత తనని అవమానించారన్న కోపంతో ఆయన ఈ ఎన్నికల ప్రచారంతో తనకు సంబంధం లేదని బాంబ్ పేల్చిన సంగతి తెలిసిందే! ప్రియాంకా గాంధీతో చర్చలు ఫలించడం, గురువారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క భేటీలో తనకు తగిన గౌరవం దక్కడంతో.. ఎన్నికల క్యాంపెయిన్‌లో పాల్గొంటానని వెల్లడించారు. మునుగోడులో పార్టీ అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తే బాగుంటుందన్న విషయంపై.. కోమటిరెడ్డి తన అభిప్రాయాన్ని భట్టి విక్రమార్కకు తెలియజేశారు.
అయితే.. ఎన్నికల ప్రచారం విషయంలో మాత్రం కోమటిరెడ్డి ఒక చిన్న మెలిక పెట్టారు. కేవలం అవసరం అయినప్పుడు మాత్రమే ప్రచారానికి హాజరవుతానని ఫిట్టింగ్ పెట్టారు. ఇదే విషయాన్ని పార్టీ అధిష్ఠానానికి తెలియజేయాలని భట్టి విక్రమార్కను తాను కోరానని, అందుకు ఆయన సానుకూలంగానే స్పందించారని అన్నారు. ఈ భేటీలో అభ్యర్ధి ఎంపికపై చర్చ చేశామన్న ఆయన.. సోనియా గాంధీ, ప్రియాంక నిర్ణయం మేరకు అభ్యర్ధిని ఎంపిక చేయడం జరుగుతుందని వివరించారు. సర్వేల ఆధారంగా అభ్యర్థిని ఎంపిక చేస్తారని.. అయితే తుది నిర్ణయం మాత్రం ఏఐసీసీదే అని కోమటిరెడ్డి వెల్లడించారు.
Also Read
తాజావార్తలు
-
Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
-
US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
-
CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
-
BCCI Chief Selector: అజిత్ అగార్కర్ అవుట్.. చీఫ్ సెలెక్టర్ రేసులో ఆ ఇద్దరు మాజీ క్రికెటర్లు!
-
Gold and Silver Prices Today: గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!