Komatireddy:కేటీఆర్..హరీష్ లకు కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ విసిరారు. ఏ సబ్ స్టేషన్ వెళదాం? అని ప్రశ్నించారు. నువ్వు 24 గంటల కరెంట్ ఇస్తే ఎంపీ పదవికి రాజీనామా చేస్తా అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ వైరల్ ఫీవర్ తో బాధ పడుతున్నాడు.. త్వరగా కోలుకోవాలని అన్నారు. పెట్టుబడి సాయం 10 ఎకరాలపై ఉన్నవాళ్లకు రావడం లేదన్నారు. జగదీష్ రెడ్డి మంత్రిగా ఉన్నా.. లేనట్టే అన్నారు. ఆయనకు అవగాహనే లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చేది 10..12 గంటలు.. మూడు నాలుగు సార్లు కోతలు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్.. కేటీఆర్ సమీక్ష చేసుకో అంటూ సవాల్ విసిరారు. కాంగ్రెస్ వాళ్లు టికెట్లు అమ్ముకుంటున్నారు అంటున్నాడు హరీష్.. పనికి మాలిన మాటలు అపు అంటూ ఫైర్ అయ్యారు. రైతులకు కరెంట్ సరిగా సప్లై లేక పంటలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. దాని మీద దృష్టి పెట్టండి అంటూ సూచించారు. కేటీఆర్..హరీష్ లకు సవాల్ చేస్తున్నా.. ఏ సబ్ స్టేషన్ వెళదాం రండి.. మీరు 24 గంటల కరెంట్ ఇస్తే ఎంపీ పదవికి రాజీనామా చేస్తా అని సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే సబ్ స్టేషన్ కి పోదాం రండి అంటూ సవాల్ విసిరారు.
రైతులు వచ్చే ఎన్నికల్లో బుద్ది చెప్పడం ఖాయం మని అన్నారు. ధాన్యం సేకరణ ఇప్పటి వరకు సమీక్ష లేదని మండిపడ్డారు. ఎంత సేపు.. ప్రతిపక్షాల మీద మాట్లాడటం.. ఎలా ఎన్నికల్లో గెలవాలని ఆలోచనే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. Tspsc మా తప్పు లేదు అంటున్నది.. మరి హైకోర్టు తప్పా? అని ప్రశ్నించారు. పరీక్షలు తప్పుల తడక చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు పేదలకు బతుకునిచ్చే పథకాలని, మహిళ లకు ఉచిత బస్సు తప్పకుండా ఉంటుందన్నారు. కేసీఆర్ పెట్టిన దుబారా మానేస్తే..ఆరు స్కిం లు అమలు చేయొచ్చని వ్యంగాస్త్రం వేశారు. అమలు చేయకపోతే దిగిపోతాం కానీ మోసం చెయ్యం అన్నారు. దళిత బంధు ఇవ్వడానికి సరిపడా నిధులు ఉన్నాయా? కేసీఆర్ కి అవగాహన ఉందా..? దళిత బంధు అందరికి ఇస్తా అని ఎలా అంటున్నాడు? అని ప్రశ్నించారు. తుంగతుర్తి mla అకౌంట్ లోకి 60 కోట్లు వెళ్లాయి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. దళిత బంధులో వాటా తీసుకున్నాడు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. జీతాలు 20 తారికు ఇస్తున్నావు.. ఒకటో తేదీ జీతాలు ఇవ్వకపోవడం తెలంగాణకి అవమానం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రగతి భవన్ టెండర్ ఎంత? సెక్రటేరియట్ టెండర్ ఎంత అయ్యింది ఎంతో చెప్పండి అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
Food Packing: వామ్మో నిజమేనా..? ఇందులో ఉన్న ఆహారం తింటే కాన్సర్ గ్యారెంటీనా..!