Komatireddy Venkat Reddy : ప్రతిపక్ష నాయకుడు బాధ్యతలు హరీష్ రావుకు అప్పగించాలి
- అసెంబ్లీ ఆవరణలో కోమటిరెడ్డి.. ఉత్తమ్ రెడ్డి సరదా సంభాషణ
- కాలేశ్వరం ప్రాజెక్టుపై కెసిఆర్ అసెంబ్లీలో మాట్లాడాలని డిమాండ్
- ప్రతిపక్ష నేత హోదా అవసరమా? అని ప్రశ్నించిన కోమటిరెడ్డి
- కెసిఆర్ రాకపోతే ప్రతిపక్ష నేతగా రాజీనామా చేయాలని సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komatireddy Venkat Reddy : తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో కాంగ్రెస్ సీనియర్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య ఆసక్తికరమైన చిట్ చాట్ జరిగింది. రేపు అసెంబ్లీలో కాలేశ్వరం కమిషన్ నివేదిక ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఇద్దరు నేతలు సరదాగా మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, “మా స్టార్ బ్యాట్స్‌మన్ నువ్వే” అని కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉద్దేశించి చెప్పగా, వెంటనే స్పందించిన కోమటిరెడ్డి, “మా కెప్టెన్ నువ్వే” అంటూ ఉత్తమ్‌ను సంబోధించారు. తరువాత మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని కోరారు. ముఖ్యంగా కాలేశ్వరం ప్రాజెక్టుపై స్వయంగా అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడితే ప్రజలకు స్పష్టత వస్తుందని అన్నారు.
Piyush Goyal: భారత్ ఎవరికీ తలవంచదు.. అమెరికా సుంకాల వేళ కీలక ప్రకటన..
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్‌రావు సంచలన ఆరోపణలు
అయితే ప్రతి అసెంబ్లీ సమావేశంలో హరీష్ రావు, కేటీఆర్‌లను మాత్రమే మాట్లాడమని కేసీఆర్ సూచించడం సరికాదన్నారు. అలా అయితే ప్రతిపక్ష నాయకుడి హోదా అవసరమా అని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోతే ప్రతిపక్ష నేతగా రాజీనామా చేయాలని, అవసరమైతే ఆ బాధ్యతలను హరీష్ రావుకు అప్పగించాలన్నారు. రేపు అసెంబ్లీలో జరగబోయే కాలేశ్వరం కమిషన్ నివేదికపై చర్చకు ముందు కాంగ్రెస్ నేతల సరదా సంభాషణతో పాటు కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!