Site icon NTV Telugu

Komatireddy Rajgopal Reddy : హరీష్, కడియం లాగా.. మేము జీ హుజూర్ బ్యాచ్ కాదు

Komatireddy Rajgopal Reddy

Komatireddy Rajgopal Reddy

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. అయితే.. ఈ నేపథ్యంలోనే ఇవాళ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా.. హరీష్, కడియం లాగా.. మేము జి హుజూర్ బ్యాచ్ కాదన్నారు. కడియం, హరీష్ లు మమ్మల్ని చిల్చాలను గుంటకాడ నక్కల్లా ఎదురుచూస్తున్నారని, మేము పదవుల కోసం కాదు.. ప్రజల కోసం ఉండేవాళ్ళమన్నారు. బీఆర్ఎస్ చీప్ పాలిటిక్స్ మానుకోవాలని ఆయన హితవు పలికారు. అంతేకాకుండా.. కేసీఆర్.. రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆయన ఆరోపించారు. ఇప్పుడు రాష్ట్రాన్ని కాపాడుకునే భాధ్యత మా పై పడిందని ఆయన తెలిపారు.

Kumari Aunty: మొన్న అక్కడ.. ఇప్పుడు ఇక్కడ.. ఇక నెక్స్ట్ బిగ్ బాసే..?

నల్గొండ సభ కోసం.. డబ్బులు పెట్టు జగదీశ్వర్ రెడ్డి కాళ్ళు పట్టుకుంటున్నారని, ఆ సభకు ప్రజలు రారు.. కార్యకర్తలు మాత్రమేనని ఆయన వ్యాఖ్యానించారు రాజగోపాల్‌ రెడ్డి. బీఆర్ఎస్ ను ఇంటి బాట పట్టినందుకా కేసీఆర్ పోరుబాట.? అని ఆయన హెద్దెవా చేశారు. కేటీఆర్ కు దమ్ముంటే పార్టీని నడుపమను అని ఆయన సవాల్‌ విసిరారు. హరీష్‌ను మా పార్టీలోకి రమ్మంటున్నామని ఆయన వ్యాఖ్యానించారు. హరీష్ కష్టపడతారు.. అక్కడ భవిష్యత్ లేదని రాజగోపాల్‌ రెడ్డి అన్నారు. హరీష్.. రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ అని, 26 మందిని తీసుకువస్తే… హరీష్ కు దేవాదాయ శాఖ ఇస్తాం.. చేసిన పాపాలు కడుక్కోవచ్చు అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్గొండ సభ.. అట్టర్ ప్లాప్ అవుతుందని, బీఆర్ఎస్ ను పజలు అసహ్యించుకుంటున్నా రని ఆయన అన్నారు.

Rivaba: మామ ఆరోపణలు.. సీరియస్ అయిన రవీంద్ర జడేజా సతీమణి

Exit mobile version