నిరుద్యోగ యువత ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేయడం మంచిదేనని కాంగ్రెస్ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం ఉద్యోగ అవకాశాలను భర్తీ చేయాలని ఆయన కోరారు.
నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ… నిరుద్యోగ యువతకు దారి చూపించే బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని ఆయన చెప్పారు. నిరుద్యోగులను మనమే కాపాడుకోవాలన్నారాయన. గ్రూప్ -1 అవకతవకలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆయన తెలిపారు. కేసీఆర్ ను గద్దె దించడంతో యువత కీలక పాత్ర పోషిందన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ప్రస్తుతం నిరుద్యోగులు కష్టాల్లో ఉన్నారని.. వారిని ఆదుకునే బాధ్యత తమపై ఉందన్నారు.
నిరుద్యోగులకు అండగా ఉంటా అమరవీరుల సాక్షిగా చెప్తున్నా..మీ సమస్యలు వినేందుకు నేనే వస్తా.. అని నిరుద్యోగులు తెలిపారు. సిటీ సెంట్రల్ లైబ్రరీ , అశోక్ నగర్ కు వస్తా మీ నిరసనలకు నా మద్దతు ఎప్పుడు ఉంటుందన్నారు. నిరుద్యోగుల పట్ల ఏ సమస్య అయినా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్తానని ఆయన అన్నారు.
తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరగవద్దని సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చిందన్నారు.