Komatireddy: సెంటిమెంట్‌ను రెచ్చగొట్టే పనిలో టీఆర్ఎస్.. సమాధానం చెప్పలేకే ఎదురుదాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెంటిమెంట్‌ను రెచ్చగొట్టే పనిలో టీఆర్ఎస్ పార్టీ పడిపోయిందని విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. అసెంబ్లీలో టీఆర్ఎస్ సభ్యులు, కోమటిరెడ్డి మధ్య మాటల యుద్ధమే నడిచింది.. ఆ తర్వాత మీడియా పాయింట్‌కు వచ్చిన రాజగోపాల్ రెడ్డి.. ప్రభుత్వం.. ఇప్పుడు మంత్రులుగా ఉన్నవారిని టార్గెట్ చేశారు.. నన్ను కాంట్రాక్టర్ అని పిలిచినా మంత్రి తెలంగాణ ఉద్యమంలో అయన పాత్ర ఏంటి..? ఇప్పుడు ఆయన స్థానం ఎక్కడ ఉంది..? అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నన్ను వ్యాపారంలో దెబ్బతీశారు.. తలసాని కూడా ఎన్నో వ్యాపారాలు చేసేవచ్చారు.. నేను కూడా అలాగే అనాలా ? అని నిలదీశారు. రాజకీయంగా సమాధానం చెప్పలేకే.. మాపై ఎదురుదాడికి దిగారని మండిపడ్డారు..
Read Also: Telangana: మారనున్న ఇంటర్ పరీక్షల తేదీలు
Also Read
- Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
- Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలు
- HYDRA: నార్సింగిలో హైడ్రా దూకుడు.. ఆ చెరువు చుట్టూ కంచె నిర్మాణం షురూ..
- Nalgonda Bus Fire: విజయవాడ హైవేపై ట్రావెల్స్ బస్సు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ 36 మంది ప్రయాణికులు
తెలంగాణ గురించే మాట్లాడని వాళ్లు, మమ్మల్ని సభలో మాట్లాడకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన కోమటిరెడ్డి.. తెలంగాణ గురించే మాట్లాడని అయన.. ఇప్పుడు ఆ హోదాలోకి ఎలా వచ్చాడు..!? అని ప్రశ్నించారు.. తెలంగాణ ప్రజలు ఆలోచన చేయండి.. అవినీతి పాలన.. కుటుంబ పాలనకు స్వస్తి పలకాలి.. గవర్నర్ ప్రసంగం లేకుండా ఎప్పుడైనా సభ జరిగిందా .? అని మండిపడ్డారు.. ఇక, సింగరేణిని ప్రైవేట్ పరం చేస్తాం అని కేంద్రం ఎప్పుడూ చెప్పలేదన్నారు కోమటిరెడ్డి.. కేంద్రం సింగరేణిని తీసుకోదని స్పష్టం చేసిన ఆయన.. కానీ, టీఆర్ఎస్ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టే పనిలో పడిపోయిందని ఆరోపించారు..ఇక, బంగారు తెలంగాణ అని అప్పుల తెలంగాణ చేయలేదా..!? పేర్లు మార్చి ప్రాజెక్టులకు లక్ష కోట్లు అదనంగా వెచ్చించి కాంట్రాక్టర్ల జేబులు నింపలేదా? అని ప్రశ్నల వర్షం కురపించారు. అసెంబ్లీలో గొంతు లేకుండా చేశాం… అయినా మాట్లాడుతున్నారు అని నాపై దాడి చేస్తున్నారని ఫైర్ అయిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి.. నా కంటే పెద్ద పదవిలో ఉన్న వాళ్లు చేస్తున్న పనులు ఎంటి..? కాంట్రాక్టు చేయడం తప్పా… దొంగతనమా..? డబ్బుల కోసం అయితే అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి తో… ఇప్పుడు కేసీఆర్ దగ్గరికి వెళ్లి పనులు చేసుకునే వాళ్లం కదా? అన్నారు. తెలంగాణ కోసం త్యాగం చేసిన కుటుంబం కోమటిరెడ్డి బ్రదర్స్ అని స్పష్టం చేశారు. పైసా లేని వాళ్లు.. ఇప్పుడు కోట్లకు పడగ లేత్తారని ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
తాజావార్తలు
-
Wife Harassment: భార్య వేధిస్తుంది, మరణించే అనుమతి ఇవ్వండి..
-
Drushyam 4: దృశ్యం తరహాలో పాల వ్యాపారి స్కెచ్.. చివరికిలా దొరికిపోయాడు
-
AJMEER MURDER: మొగుడిపై కోపంతో.. అతని కుటుంబాన్ని బలితీసుకున్న మొదటి భార్య..
-
Shubman Gill Vs Vaibhav: వైభవ్ సూర్యవంశీ నరకం చూపిస్తాడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన శుభ్‌మన్ గిల్..
-
Vijayawada: నమ్మకస్థురాలే రక్తం పారించింది.. అమెరికాలోని కుమార్తె మాట్లాడుతుండగా..!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..